News September 10, 2024
త్వరలో విజయవాడ-HYD హైవే ఎత్తు పెంపు?

AP: మున్నేరు వరద వచ్చినప్పుడల్లా ఎన్టీఆర్(D) ఐతవరం వద్ద జాతీయ రహదారిపైకి వరద నీరు చేరుతోంది. దీని వల్ల విజయవాడ, హైదరాబాద్ రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఐతవరం వద్ద హైవే ఎత్తు పెంచాలని NHAI యోచిస్తోంది. త్వరలో ఈ రోడ్డును ఆరు వరుసలుగా విస్తరించనుండగా, సమస్యాత్మక ప్రాంతంలో 400-500m మేర 5-6 అడుగుల వరకు హైవే ఎత్తు పెంచాలని అధికారులు భావిస్తున్నారు.
Similar News
News November 13, 2025
రోడ్లకు నేతల పేర్లకు బదులు కంపెనీల పేర్లు: సీఎం

TG: దేశంలో రోడ్లకు ఎక్కువగా నేతల పేర్లు ఉన్నాయని, హైదరాబాద్లో తాము ఆ ట్రెండ్ను మార్చాలనుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ముఖ్యమైన రోడ్లకు గూగుల్, మెటా, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీ పేర్లను పెడతామని అన్నారు. ఢిల్లీలో జరిగిన US-India సమ్మిట్లో సీఎం పాల్గొన్నారు. 30 వేల ఎకరాల్లో ‘ఫ్యూచర్ సిటీ’, మూసీ పునరుజ్జీవనం, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్ ప్రాజెక్టులు చేపట్టామన్నారు.
News November 13, 2025
సింగరేణిలో 82 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

సింగరేణిలో 82 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్నల్ అభ్యర్థులతో ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 24లోగా అప్లై చేసుకోవాలి. దరఖాస్తు హార్డ్ కాపీని ఈనెల 26లోగా పంపాలి. బేసిక్ శాలరీ నెలకు రూ.50,000 చెల్లిస్తారు. వెబ్సైట్: scclmines.com
News November 13, 2025
ప్రతి కశ్మీరీ ముస్లిం టెర్రరిస్టు కాదు: J&K సీఎం

ప్రతి కశ్మీరీ ముస్లిం టెర్రరిస్టు కాదని జమ్మూకశ్మీర్ CM ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఢిల్లీ పేలుడు ఘటనను ఆయన ఖండించారు. అమాయకులను క్రూరంగా చంపడాన్ని ఏ మతమూ సమర్థించదని తెలిపారు. కశ్మీర్లో శాంతి, సోదరభావాన్ని నాశనం చేసేవారు కొందరు ఉంటారని విమర్శించారు. బ్లాస్ట్ కారకులను కఠినంగా శిక్షించాలని, అమాయకులను వదిలేయాలని కోరారు. ఓ డాక్టర్ను <<18268521>>ఉద్యోగం నుంచి తొలగించాక<<>> దర్యాప్తు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.


