News July 6, 2024
త్వరలో విజయవాడ-కర్నూలు విమాన సర్వీసులు: మంత్రి భరత్

AP: కర్నూలు నుంచి విజయవాడకు త్వరలోనే విమాన సర్వీసులు ప్రారంభిస్తామని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ను కలిసి ఆయన వినతిపత్రం సమర్పించారు. అలాగే రాత్రి పూట ఫ్లైట్ ల్యాండింగ్కు అవకాశం కల్పించాలని కోరగా, ఏడాది లోపే ఏర్పాట్లు చేస్తామని రామ్మోహన్ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.
Similar News
News December 3, 2025
వేగంగా కాదు.. క్షేమంగా వెళ్లండి: సిద్దిపేట సీపీ

వేగంగా వెళ్లడం కాదు.. క్షేమంగా వెళ్లడం ముఖ్యమని సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎస్.ఎం.విజయ్ కుమార్ పేర్కొన్నారు. అతివేగం ఎప్పటికైనా ప్రమాదమే అని, వేగంగా వెళ్లి ప్రాణాలు కోల్పోవద్దని కోరారు. మీ నిర్లక్ష్యం ఇతరులకు శాపం కావద్దన్నారు. మీ క్షేమం కోసమే ట్రాఫిక్ నిబంధనలు అమలు చేస్తున్నామని, ప్రతి ఒక్కరూ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. అతివేగంతో వెళ్లి మీ కుటుంబాన్ని రోడ్డున పడేయొద్దని అన్నారు.
News December 3, 2025
ధోనీ రూమ్లో చాలా చేసేవాళ్లం: మైక్ హస్సీ

క్రికెట్ మైదానంలో ఎంతో ప్రశాంతంగా ఉండే ధోనీ ఆఫ్ఫీల్డ్లో ఎలా ఉంటారో CSK మాజీ ఆటగాడు, కోచ్ హస్సీ వెల్లడించారు. ప్రతి IPL సీజన్లో ధోనీ రూమ్ అనధికారిక టీమ్ లాంజ్లా మారేదన్నారు. ప్లేయర్లు 24 గంటలూ అక్కడే మాట్లాడుకోవడం, ఫుడ్ షేర్ చేసుకోవడం, కొందరు హుక్కాతో రిలాక్స్ అవ్వడం జరిగేదన్నారు. ఇటువంటి బాండింగ్ కారణంగానే CSK ఒక కుటుంబంలా మారిందని అభిప్రాయపడ్డారు.
News December 3, 2025
సమంతతో పెళ్లిపై రాజ్ సోదరి ఎమోషనల్ పోస్ట్!

సమంతను తమ కుటుంబంలోకి ఆహ్వానిస్తూ రాజ్ నిడిమోరు సోదరి శీతల్ ఇన్స్టాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘చంద్రకుండ్లో శివుడిని ప్రార్థిస్తూ లింగాన్ని ఆలింగనం చేసుకున్నా. ఆనందబాష్పాలతో నా హృదయం ఉప్పొంగుతోంది. ఇప్పుడు మా కుటుంబం పరిపూర్ణమైంది. వీరికి మేమంతా అండగా ఉంటాం. వాళ్లను చూస్తుంటే గర్వంగా ఉంది’ అని ఆమె రాసుకొచ్చారు. ‘లవ్ యూ’ అని సామ్ దీనికి రిప్లై ఇచ్చారు.


