News June 15, 2024

నేటి నుంచి విజయవాడ-ముంబై విమాన సర్వీసు

image

AP: విజయవాడ-ముంబై మధ్య నేటి నుంచి ఎయిర్ ఇండియా విమాన సర్వీసు అందుబాటులోకి రానుంది. కేంద్ర పెద్దలతో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అనేకమార్లు జరిపిన చర్చల చొరవతో ఈ సర్వీసుకు వీలు కలిగింది. ప్రతిరోజూ సా.3.55 గంటలకు ముంబైలో బయల్దేరనున్న విమానం సా.5.45 గంటలకు విజయవాడ చేరుతుంది. అలాగే రాత్రి 7.10 గంటలకు విజయవాడ నుంచి బయల్దేరి రాత్రి 9 గంటలకు ముంబై చేరుతుంది.

Similar News

News November 4, 2025

నెల్లూరు సెంట్రల్ జైలుకు జోగి రమేశ్

image

AP: కల్తీ మద్యం కేసులో అరెస్టైన జోగి రమేశ్‌ను విజయవాడ నుంచి నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. జైలు వద్ద ఆయనతో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్, MLC చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. CBNను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని కాకాణి మండిపడ్డారు. TDPకి అంటుకున్న బురదను YCP నేతలపై చల్లుతున్నారని ఆరోపించారు. మరోవైపు రమేశ్‌ను అకస్మాత్తుగా నెల్లూరు జైలుకు ఎందుకు తరలించారని పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

News November 4, 2025

నేపాల్‌లో ఏమైందో తెలుసు కదా?.. పోర్న్ బ్యాన్ పిల్‌పై సుప్రీంకోర్టు

image

దేశంలో పోర్నోగ్రఫీని నిషేధించాలని కోరుతూ దాఖలైన పిల్‌ను తక్షణమే విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ సందర్భంగా నేపాల్‌లో జరిగిన Gen Z నిరసనలను ప్రస్తావించింది. ‘సోషల్ మీడియాను నిషేధించడం వల్ల నేపాల్‌లో ఏం జరిగిందో చూశారు కదా?’ అని CJI బీఆర్ గవాయ్ నేతృత్వంలోని బెంచ్ వ్యాఖ్యానించింది. 4 వారాల తర్వాత విచారిస్తామని స్పష్టంచేసింది. అయితే నవంబర్ 23నే జస్టిస్ గవాయ్ రిటైర్ కానుండటం గమనార్హం.

News November 4, 2025

రాత్రంతా ఆలోచిస్తూ, ఒంటరిగా ఉంటూ.. మృత్యుంజయుడి ఆక్రందన!

image

అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి బయటపడిన <<16688689>>మృత్యుంజయుడు<<>> రమేశ్ మానసికంగా కుంగిపోతున్నాడు. ‘ప్రమాదంలో తమ్ముడిని కోల్పోయా. ఆ ఘటన పదే పదే గుర్తొస్తోంది. రాత్రంతా ఆలోచిస్తూ, మేలుకొనే ఉంటున్నా. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నా. నా భార్యతో, కొడుకుతోనూ మాట్లాడటం లేదు. మానసికంగా బాధపడుతున్నా. 4 నెలలుగా అమ్మ మాట్లాడట్లేదు’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.