News July 8, 2024

‘మైత్రి’కి విజయ్ సినిమా పంపిణీ హక్కులు

image

తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ తెలుగులో రిలీజ్ చేయనుంది. ఏపీ, తెలంగాణ డిస్ట్రిబ్యూషన్ హక్కులను తాము సొంతం చేసుకున్నట్లు ప్రకటించింది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో ప్రశాంత్, స్నేహ, మీనాక్షి చౌదరి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబర్ 5న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది.

Similar News

News February 16, 2026

మేయర్, ఛైర్మన్ల ఎన్నిక ఇలా..

image

TG: ఇవాళ 7 కార్పొరేషన్ల మేయర్లు, 116 మున్సిపాలిటీల ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది. ఉ.11 గంటలకు గెలిచినవారితో అధికారులు ప్రమాణం చేయిస్తారు. తర్వాత ఆయా పదవులకు నామినేషన్లు స్వీకరిస్తారు. మిగతా సభ్యులతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులు(MP,MLA,MLC) చేతులెత్తి మద్దతు తెలుపుతారు. 50 శాతానికిపైగా ఓట్లు వచ్చినవారిని విన్నర్‌గా ప్రకటిస్తారు. సమాన ఓట్లు వస్తే లాటరీ ద్వారా విజేతను నిర్ణయిస్తారు.

News February 16, 2026

2 అల్పపీడనాలు.. వర్ష సూచన!

image

దక్షిణ బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తమిళనాడు, శ్రీలంకలో వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈ నెల 19 తర్వాత ఉపరితల ఆవర్తనం ఏర్పడి, అల్పపీడనంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయని పేర్కొంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వానలు పడతాయని అంచనా వేసింది. ఈ నెల 25 నుంచి 28 వరకు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

News February 16, 2026

జీడిమామిడిలో అంతర పంటలు.. లాభాలు

image

జీడిమామిడి తోటల్లో తొలి ఏడాది అంతర పంటల సాగుకు అనుకూలం. దీని వల్ల కలుపు ప్రభావం తగ్గుతుంది. ఈ తోటల్లో వర్షాధారంగా కర్రపెండలం, పెసలు, మినుము, పశుగ్రాసాలు, పూలు, కూరగాయలు, ఆకుకూరలు, పైనాపిల్‌ను అంతర పంటలుగా సాగు చేయవచ్చు. దీని వల్ల భూసారంతో పాటు, జీడిమామిడిలో దిగుబడులు కూడా పెరుగుతాయి. అంతర పంటలతో అదనపు ఆదాయం కూడా సమకూరుతుంది. అయితే ఈ అంతరపంటలకు కూడా జీడిమామిడితో పాటు సక్రమంగా ఎరువులను అందించాలి.