News April 3, 2024
చివరి సినిమాకు విజయ్‌కి భారీ రెమ్యునరేషన్?

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్‌కి ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం విజయ్ ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆయన రాజకీయ ప్రవేశం చేయడంతో అభిమానుల కోసం తన చివరి సినిమాను హెచ్. వినోద్‌తో చేయనున్నారు. అయితే, ఈ సినిమాకి విజయ్ రికార్డు స్థాయిలో రూ.250 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోనున్నట్లు వార్తలొస్తున్నాయి. ‘ది గోట్’ కోసం కూడా ఆయన రూ.200 కోట్లు తీసుకుంటున్నారట.
Similar News
News December 9, 2025
గొర్రెల ఎంపికలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

గొర్రెల మంద ఎదుగుదలలో ఆడగొర్రెలది కీలకపాత్ర. ఇది ఎంత బాగుంటే మంద అంత బాగుంటుంది. ఆడ గొర్రెలు త్వరగా ఎదిగి , సంతానోత్పత్తికి అనుకూలంగా మారే లక్షణం కలిగి ఉండాలి. మందలో పునరుత్పాదక శక్తి తగ్గిన, పళ్లు లేని గొర్రెలను ఏరివేయాలి. ఏడాది కంటే ఎక్కువ కాలం ఎదకి రాని గొర్రెలు, గొడ్డుమోతు జీవాలను మంద నుంచి ఏరివేసి, చూడి లేదా తొలిసారి ఈనిన గొర్రెలను కొంటే బాగుంటుంది. ఏటా ముసలి గొర్రెలను మంద నుంచి తీసేయాలి.
News December 9, 2025
‘ద్వార లక్ష్మీ పూజ’ ఎలా చేయాలి?

ఉదయాన్నే లేచి గడపను శుభ్రం చేసుకొని పసుపు, కుంకుమ, పువ్వులతో అలంకరించాలి. 3 వత్తుల దీపం, బెల్లం, అటుకులు, తాంబూలం నైవేద్యంగా పెట్టాలి. గణేషుడిని నమస్కరించి సంకల్పం చెప్పుకోవాలి. వేంకటేశ్వర స్వామి, లక్ష్మీ అష్టోత్తరాలు చదివి హారతి ఇవ్వాలి. దీపం కొండెక్కే వరకు ఉంచి, తర్వాత తొలగించాలి. పూజ పూర్తయ్యాక నిద్రపోవడం శుభకరం కాదు. పెళ్లికానివారు, ఇంటి, ఉద్యోగ సమస్యలు ఉన్నవారు ఈ పూజ చేయవచ్చు.
News December 9, 2025
IIIT కొట్టాయంలో ఉద్యోగాలు

<


