News December 9, 2024

మ‌హ్మ‌ద్ యూన‌స్‌తో విక్ర‌మ్ మిస్త్రీ బృందం భేటీ

image

బంగ్లా తాత్కాలిక చీఫ్ మ‌హ్మ‌ద్ యూన‌స్‌తో భార‌త విదేశాంగ శాఖ కార్య‌ద‌ర్శి విక్ర‌మ్ మిస్త్రీ బృందం స‌మావేశ‌మైంది. సోమ‌వారం ఇరుదేశాల మ‌ధ్య జరిగిన అత్యున్న‌త స్థాయి స‌మావేశం అనంతరం యూనస్‌ను కలిసింది. ఇరుదేశాల మ‌ధ్య అన్ని రంగాల్లో స‌హకారం కొన‌సాగింపు, సంయుక్త ప్ర‌యోజ‌నాల‌పై క‌లిసి ప‌నిచేసేందుకు ఆస‌క్తిగా ఉన్న‌ట్టు భార‌త్ పేర్కొంది. అలాగే బంగ్లాలో మైనారిటీల భ‌ద్ర‌త‌కు భ‌రోసా క‌ల్పించాల‌ని కోరింది.

Similar News

News November 22, 2025

ముగిసిన నామినేషన్ల ప్రక్రియ: కలెక్టర్

image

మహేశ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ బోర్డు ఆప్ డైరెక్టర్ల ఎన్నికల నామినేషన్ స్వీకరణ ప్రక్రియ పూర్తయింది. 48 మంది నుంచి 66 నామినేషన్లు స్వీకరించినట్లు జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించి కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నామినేషన్లు స్వీకరించినట్లు చెప్పారు. శనివారం 12 మంది అభ్యర్ధులు 14 సెట్ల నామినేషన్లు వేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.

News November 22, 2025

బీసీలను ప్రభుత్వం నట్టేట ముంచింది: R.కృష్ణయ్య

image

TG: BCలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని నమ్మించి చివరికి ప్రభుత్వం నట్టేట ముంచిందని ఎంపీ R.కృష్ణయ్య మండిపడ్డారు. రిజర్వేషన్లపై సర్కార్ ఇవాళ జారీ చేసిన జీవో 46ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు సూచించినట్లుగా ప్రస్తుత సామాజిక-రాజకీయ పరిస్థితులను అధ్యయనం చేయకుండా, గదుల్లో కూర్చొని నివేదికలు సిద్ధం చేయడం బీసీలను రాజకీయంగా దెబ్బతీయడమేనని వ్యాఖ్యానించారు.

News November 22, 2025

ఆస్కార్ బరిలో ‘మహావతార్ నరసింహ’

image

దేశంలో కలెక్షన్ల సునామీ సృష్టించిన ‘మహావతార్ నరసింహ’ ఆస్కార్ రేసులో నిలిచింది. బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీకి నామినేట్ అయింది. KPop Demon Hunters, Zootopia 2 వంటి చిత్రాలతో పోటీ పడనుంది. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రానికి భారత్‌లో విపరీతమైన ఆదరణ లభించింది. ప్రజలు థియేటర్లకు బ్రహ్మరథం పట్టారు. దీంతో ఈ సినిమా రూ.326 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.