News July 20, 2024

NCA హెడ్‌గా విక్రమ్ రాథోడ్?

image

నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) హెడ్‌గా టీమ్ ఇండియా మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత NCA హెడ్ VVS లక్ష్మణ్ కాంట్రాక్టు మరో 2 నెలల్లో పూర్తి కానుంది. దీంతో రాథోడ్‌ను నియమించాలని BCCI భావిస్తోందట. కాగా మరోసారి NCA బాధ్యతలు చేపట్టేందుకు లక్ష్మణ్ విముఖత చూపుతున్నట్లు సమాచారం. సన్‌రైజర్స్ హైదరాబాద్ మెంటార్‌గా ఉండేందుకు ఆయన ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

Similar News

News January 14, 2026

తెలుగు ప్రజలకు మోదీ సంక్రాంతి శుభాకాంక్షలు

image

సంక్రాంతి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ సంక్రాంతి మీ జీవితాల్లో సరికొత్త ఆశయాలు, ఉన్నత లక్ష్యాలను నింపాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా ఈ పండుగ మన అన్నదాతలది. నిరంతరం శ్రమిస్తూ దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు కృతజ్ఞతలు తెలిపే పవిత్ర సమయం. ఈ సందర్భంగా సమాజంలో శాంతి, సామరస్యాలు వెల్లివిరియాలని కోరుకుంటున్నా’ అని Xలో పోస్ట్ చేశారు.

News January 14, 2026

పితృ దేవతలకు నేడు తర్పణాలు వదిలితే..

image

మకర సంక్రాంతి ఎంతో పవిత్ర దినం. తండ్రీకొడుకులైన సూర్యశనుల కలయికకు ఇది ప్రతీక. ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు విడిచి, పేదలకు అన్నదానం చేయడం వల్ల విశేష పుణ్యం లభిస్తుంది. కొత్త కుండలో పాలు పొంగించి సూర్యుడికి నైవేద్యం సమర్పిస్తారు. శని దోష నివారణకు నువ్వులు, బెల్లం, గుమ్మడికాయలు దానం చేస్తారు. పంట చేతికి వచ్చే ఈ ‘కుప్ప నూర్పిడుల పండుగ’ వెలుగును, ఆరోగ్యాన్ని, సిరిసంపదలను ప్రసాదించే గొప్ప వేడుక.

News January 14, 2026

చేపల చెరువుల్లో నీటి పీహెచ్ స్థాయి ఎంత ఉండాలి?

image

☛ చేపలు ఎక్కువగా పీహెచ్ స్థాయి 7.0-8.5 మధ్య ఉన్న చెరువు నీటిలో బాగా పెరుగుతాయి. ☛ చెరువులో నీటి పీహెచ్ స్థాయి 6.5 కన్నా తక్కువైతే (ఆమ్ల ధర్మం గల నీరు) చేపలు బలహీనమై, వ్యాధుల బారినపడతాయి. ☛ చెరువులో నీటి పీహెచ్ స్థాయి 9 కన్నా ఎక్కువైతే (క్షార ధర్మం గల నీరు) చేపల మొప్పలు దెబ్బతిని, ప్రాణ వాయువుని గ్రహించే శక్తి చేపల్లో తగ్గుతుంది. అందుకే నీటి పీహెచ్ స్థాయిని ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి.