News July 19, 2024
విక్రమ్ ‘తంగలాన్’ రిలీజ్ డేట్ ఫిక్స్

కోలీవుడ్ హీరో విక్రమ్ నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘తంగలాన్’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ సినిమాను ఆగస్టు 15న పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. పా.రంజిత్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో మాళవిక మోహనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాలో విక్రమ్ ట్రైబల్ లీడర్గా కనిపించనున్నారు.
Similar News
News November 25, 2025
అంత్యక్రియల తర్వాత స్నానం ఎందుకు చేస్తారు?

అంత్యక్రియలు పూర్తయ్యాక అక్కడికి వెళ్లిన వాళ్లందరూ స్నానం చేస్తారు. లేకపోతే ఆత్మలు దేహంలోకి ప్రవేశిస్తాయని నమ్ముతుంటారు. కానీ, అందులో ఏమాత్రం నిజం లేదు. దహన సంస్కారాల సమయంలో ఆ దేహం నుంచి వచ్చే బ్యాక్టీరియా, అంటువ్యాధులు మనక్కూడా సోకే ప్రమాదం ఉంది. ఈ అంటురోగాల నుంచి తమను తాము కాపాడుకోవడానికి, కచ్చితంగా స్నానం చేయాలి. అప్పట్లో నదులే స్నానానికి ప్రధాన వనరులు కాబట్టి అక్కడే స్నానమాచరించేవారు.
News November 25, 2025
వినూత్న నిరసన.. ఉల్లిగడ్డలకు అంత్యక్రియలు

మధ్యప్రదేశ్లో ఉల్లి ధరలు తగ్గడంపై రైతులు వినూత్నంగా నిరసన చేపట్టారు. మాండ్సౌర్ జిల్లాలోని ధమ్నార్లో ఉల్లిగడ్డలను పాడెపై పేర్చి అంత్యక్రియలు చేశారు. దేశంలో అత్యధికంగా ఉల్లి సాగు చేసే ప్రాంతాల్లో ఒకటిగా ఉన్న మాల్వా-నిమర్లో కేజీ రూపాయి పలుకుతున్నట్లు వాపోయారు. పండించేందుకు రూ.10-12 ఖర్చు అవుతుందని, ధరలు తగ్గడంతో నష్టాలే మిగులుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
News November 25, 2025
ఉద్యాన పంటలతోనే సీమ అభివృద్ధి: పయ్యావుల

AP: రాయలసీమలో రైతుల ఆదాయం పెరగాలంటే అది ఉద్యాన పంటలతోనే సాధ్యమని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. సీమలో పారిశ్రామిక అభివృద్ధితో పాటు హార్టికల్చర్ సాగు విస్తీర్ణం పెరగాలని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులకు సూచించారు. సీమలో సంపద సృష్టి, సిరి సంపదల వృద్ధి ఉద్యాన పంటలతో సాధ్యమవుతుందని, ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకుంటూ హార్టికల్చర్పై దృష్టి పెట్టాలన్నారు.


