News September 2, 2024

వాగులో చిక్కుకున్న గ్రామస్థులు

image

TG: నల్గొండ జిల్లా గోనబోయినపల్లి వద్ద గ్రామస్తులు వాగులో చిక్కుకున్నారు. వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో 10 మంది సాయం కోసం ఎదురుచూస్తున్నారు. బాధితులు డిండి(మ) దెయ్యం గుండ్లకు చెందిన వారిగా గుర్తించారు. వారిని బయటకు తీసుకొచ్చేందుకు పోలీసులు, అధికారులు ప్రయత్నిస్తున్నారు. వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు సమాచారం.

Similar News

News September 15, 2024

ఆ గ్రహశకలం వచ్చేది నేడే!

image

ఓ గ్రహశకలం భూమికి అతి సమీపంగా దూసుకెళ్లనుందని నాసా చాలారోజుల క్రితమే హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఆ శకలం దూసుకెళ్లేది నేడే. 720 అడుగుల చుట్టుకొలత కలిగిన ఆస్టరాయిడ్ పెను వేగంతో భూమికి 6.20 లక్షల మైళ్ల దూరం నుంచి ప్రయాణించనుంది. అది భూమిని ఢీకొడుతుందని, యుగాంతమేనని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే, దాని వల్ల భూమికి ముప్పు లేనట్లేనని నాసా క్లారిటీ ఇచ్చింది.

News September 15, 2024

జగన్‌పై ద్వేషంతో చంద్రబాబు ఇలా చేయడం అన్యాయం: రోజా

image

AP: జగన్‌పై ఉన్న ఈర్ష్య, ద్వేషంతో సీఎం చంద్రబాబు విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయాలనుకోవడం అన్యాయమని మాజీ మంత్రి రోజా ట్వీట్ చేశారు. ‘గత ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలని CM చంద్రబాబు నిర్ణయించారు. పులివెందుల కాలేజీకి కేటాయించిన సీట్లను రద్దు చేయాలని NMCకి లేఖ రాయడం దుర్మార్గం. YCP పాలనలో నిర్మించిన కాలేజీలన్నింటినీ ప్రభుత్వమే నిర్వహించాలి’ అని డిమాండ్ చేశారు.

News September 15, 2024

పాఠాలు మీరు చెబుతారా జగన్?: మంత్రి సత్యకుమార్

image

AP: YS జగన్ హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ నిర్మాణం కూడా పూర్తి చేయలేదని మంత్రి సత్యకుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. ‘నిర్మాణం పూర్తికాకుండానే గతేడాది కొన్ని కాలేజీలు ప్రారంభించారు. దీంతో రెండో సంవత్సరం విద్యార్థులకు క్లాసులు లేవు. పులివెందుల కాలేజీలో 48శాతం బోధనా సిబ్బంది లేరు. గదులు లేవు. విద్యార్థులను ఎక్కడ కూర్చోబెట్టాలి? పాఠాలు ఎవరు చెప్పాలి? మీరు చెబుతారా ప్రొఫెసర్ జగన్’ అని మంత్రి ఎద్దేవా చేశారు.