News December 24, 2024

విలన్లను హీరోల్లా చూపిస్తున్నారు: కూనంనేని

image

TG: ఒకప్పుడు సమాజాన్ని మార్చడానికి సినిమా ఉపయోగపడేదని, ఇప్పుడు విలన్లను హీరోల్లా చూపిస్తున్నారని CPI MLA కూనంనేని సాంబశివరావు తెలిపారు. సెన్సార్ బోర్డు పూర్తిగా ఫెయిల్ అయిందన్నారు. సంధ్య థియేటర్ వద్ద రేవతి చనిపోవడం బాధాకరమని చెప్పారు. ఈ ఘటనలో సినిమా వర్సెస్ ప్రభుత్వం అనేలా చర్చ జరిగిందని చెప్పారు. విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని శ్రీతేజ్‌ను పరామర్శించిన తర్వాత ఆయన చెప్పారు.

Similar News

News November 25, 2025

భారీగా పెరిగిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,910 పెరిగి రూ.1,27,040కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,750 ఎగబాకి రూ.1,16,450 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.3,000 పెరిగి రూ. 1,74,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News November 25, 2025

గ్యాస్ లీకైనపుడు ఏం చేయాలంటే?

image

ఇంట్లో గ్యాస్‌ సిలిండర్, స్టవ్‌ లీకేజీ, నిర్వహణ లోపాలతో ప్రమాదాలు జరిగి తీవ్ర విషాదాలను మిగులుస్తున్నాయి. ఇలా కాకుండా ఉండాలంటే.. గ్యాస్‌ లీకై దాన్ని అదుపు చేయలేకపోతే కిటికీలు, తలుపులు తెరవాలి. మంటలు చెలరేగితే మందపాటి దుప్పటి కప్పి ఆర్పేయాలి. రెగ్యులేటర్‌ను ఆపేయాలి. సిలిండర్‌ దగ్గర మంటలు చెలరేగితే తడిగా ఉండే గోనెసంచి/ వస్త్రాన్ని వేయాలి. అగ్నిమాపక శాఖ టోల్‌ఫ్రీ నంబరు 101కు సమాచారం ఇవ్వాలి.

News November 25, 2025

అంత్యక్రియల తర్వాత స్నానం ఎందుకు చేస్తారు?

image

అంత్యక్రియలు పూర్తయ్యాక అక్కడికి వెళ్లిన వాళ్లందరూ స్నానం చేస్తారు. లేకపోతే ఆత్మలు దేహంలోకి ప్రవేశిస్తాయని నమ్ముతుంటారు. కానీ, అందులో ఏమాత్రం నిజం లేదు. దహన సంస్కారాల సమయంలో ఆ దేహం నుంచి వచ్చే బ్యాక్టీరియా, అంటువ్యాధులు మనక్కూడా సోకే ప్రమాదం ఉంది. ఈ అంటురోగాల నుంచి తమను తాము కాపాడుకోవడానికి, కచ్చితంగా స్నానం చేయాలి. అప్పట్లో నదులే స్నానానికి ప్రధాన వనరులు కాబట్టి అక్కడే స్నానమాచరించేవారు.