News July 11, 2024
టీమ్ ఇండియా బౌలింగ్ కోచ్గా వినయ్ కుమార్?

భారత బౌలింగ్ కోచ్గా గంభీర్, బీసీసీఐ ఎవర్ని తీసుకుంటారన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పలువురు మాజీ ఆటగాళ్ల పేర్లు వినిపిస్తున్నాయి. బీసీసీఐ జహీర్ ఖాన్ పేరు యోచిస్తుండగా, ఆర్సీబీ, టీమ్ ఇండియా మాజీ ఆటగాడు వినయ్ కుమార్ పేరును హెడ్ కోచ్ గంభీర్ పరిశీలిస్తున్నారట. వీరిద్దరూ కాక సీఎస్కే బౌలింగ్ కోచ్ బాలాజీ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. చివరికి ఎవరు ఫైనల్ అవుతారన్నది చూడాలి మరి.
Similar News
News December 1, 2025
ADB: తీవ్ర చలిలో వేడెక్కిన రాజకీయం..!

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై చలి పులి పంజా విసురుతోంది. పంచాయతీ ఎన్నికలు రావడంతో అభ్యర్థులు చలిని సైతం లెక్కచేయకుండా రాత్రి వేళల్లో సమావేశాలు పెడుతున్నారు. రాత్రిపూట తమ మద్దతు దారులతో ఓటర్ల ఇంటికి వెళ్లి తమకే ఓటేయాలని కోరుతున్నారు. నాకు ఓటేస్తే మీ వర్గానికి కావాల్సిన పనులన్నీ చేసి ఇస్తా, అందరికీ కలిపి కొంత నగదు ఇస్తా అంటూ హామీలు ఇస్తున్నారు. ఈ చర్యలు ప్రత్యర్థులకు మరింత వణుకు పుట్టిస్తున్నాయి .
News December 1, 2025
స్వల్ప నష్టాలతో ముగిసిన మార్కెట్లు

భారత సూచీలు స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 64.77 పాయింట్లు నష్టపోయి 85,641 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 27 పాయింట్ల నష్టంతో 26,175 వద్ద క్లోజ్ అయ్యింది. హ్యుండాయ్, టాటా మోటర్స్ ప్యాసింజర్ వెహికల్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ Ltd, కోటక్ మహీంద్రా బ్యాంక్, HCL షేర్లు లాభాలు పొందాయి. ప్రెస్టీజ్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, DLF Ltd, ఒబెరాయ్ రియాల్టీ Ltd షేర్లు నష్టాల్లో ముగిశాయి.
News December 1, 2025
క్యారెట్ సాగు – ముఖ్యమైన సూచనలు

క్యారెట్ శీతాకాలం పంట. దీన్ని ఆగస్టు-డిసెంబర్ మధ్యలో నాటుకోవచ్చు. నాణ్యమైన దిగుబడి రావాలంటే 18-24 డిగ్రీల సెల్సియన్ ఉష్ణోగ్రత అవసరం. క్యారెట్ సాగుకు మురుగునీటి వసతి గల లోతైన, సారవంతమైన గరప నేలలు అత్యంత అనుకూలం. బరువైన బంకనేలలు పనికిరావు. నేల ఉదజని సూచిక 6.5గా ఉంటే మంచిది. ఎకరాకు 2 కేజీల విత్తనాలు అవసరం. ప్రతి 15 రోజుల తేడాలో విత్తనాలు విత్తుకుంటే డిమాండ్కు అనుగుణంగా మంచి దిగుబడి సాధించవచ్చు.


