News August 18, 2025
వినాయక చవితి.. ఈ విషయాలు గుర్తుంచుకోండి!

ఆగస్టు 27న గణపతి నవరాత్రి ఉత్సవాలు మొదలవనున్నాయి. విగ్రహాలు నెలకొల్పేందుకు మండపాలు సిద్ధమవుతున్నాయి. అయితే మండపాల ఏర్పాట్లలో కరెంట్ తీగలు <<17438408>>తగిలే<<>> ప్రమాదం ఉందని, జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అలాగే అత్యవసర సమయాల్లో అంబులెన్స్, పోలీసు వాహనాలు వెళ్లేలా గల్లీల్లో దారి వదిలి మండపాలు ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నారు.
Similar News
News August 18, 2025
మోదీతో సీపీ రాధాకృష్ణన్ భేటీ

ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. తనను అభ్యర్థిగా నిలిపినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేశారు. రాధాకృష్ణన్ అనుభవం దేశానికి ఎంతో ఉపయోగపడుతుందని మోదీ అన్నారు. భవిష్యత్తులోనూ దేశానికి సేవలందించాలని ఆకాంక్షించారు. అంతకుముందు ఢిల్లీకి చేరుకున్న ఆయనకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్వాగతం పలికారు. మరోవైపు రేపు మధ్యాహ్నం కేంద్ర క్యాబినెట్ సమావేశం కానుంది.
News August 18, 2025
రాహుల్‌కు కాబోయే భార్య ఎవరో తెలుసా?

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ నిశ్చితార్థం ఆయన ప్రేయసి హరిణి రెడ్డితో జరిగిన సంగతి తెలిసిందే. ఆమె కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. ఆమె స్వస్థలం నెల్లూరు. నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్న విజయ్ కుమార్ కూతురే హరిణి. విజయ్ కుమార్ 1985లో సర్వేపల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. స్పెషల్ సాంగ్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న రాహుల్‌కు ఇటీవల TG ప్రభుత్వం రూ.కోటి నజరానా అందజేసింది.
News August 18, 2025
RECORD: గణనాథుడికి ₹474కోట్ల ఇన్సూరెన్స్

వినాయక ఉత్సవాల ముంగిట ముంబై వార్తల్లో నిలిచింది. అక్కడ రిచెస్ట్ గణేశ్ మండలిగా గుర్తింపున్న GSB సేవా మండల్ తమ వినాయకుడికి ₹474.46కోట్లతో ఇన్సూరెన్స్ తీసుకుంది. గతేడాది ₹400కోట్లు, 2023లో ₹360.40 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోగా తాజా ఇన్సూరెన్స్‌తో మరోసారి రికార్డు సృష్టించింది. ఈ ఇన్సూరెన్స్ గణేశ్ బంగారం, వెండి ఆభరణాలతో పాటు వాలంటీర్లు, పూజారులు, సిబ్బంది, సెక్యూరిటీ గార్డులను కవర్ చేస్తుంది.