News August 8, 2024

సిల్వర్ ఇవ్వాలని కోర్టును ఆశ్రయించిన వినేశ్!

image

అధిక బరువు ఉన్నారనే కారణంతో అనర్హత వేటుకు గురైన రెజ్లర్ వినేశ్ ఫొగట్ క్రీడా కోర్టు(CAS)ను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. తాను ఫైనల్‌కు చేరడంతో సిల్వర్ ఇవ్వాలని ఆమె కోరినట్లు సమాచారం. తనను ఎలిమినేట్ చేయడం సరికాదని పేర్కొన్నట్లు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై కోర్టు ఇవాళ ఉదయం తీర్పు ఇవ్వనుంది. ఒకవేళ కోర్టు సానుకూలంగా స్పందిస్తే ఫైనల్లో ఓడిన రెజ్లర్‌తో వినేశ్‌ రజతం అందుకునే అవకాశం ఉంది.

Similar News

News December 31, 2025

ఆయిల్‌పామ్ సాగు, మొక్కల ఎంపికలో జాగ్రత్తలు

image

ఆయిల్‌పామ్ సాగు కోసం 12 నెలల వయసు, 1 నుంచి 1.2మీ ఎత్తు, 20-25 సెం.మీ. కాండము మొదలు చుట్టుకొలత మరియు 12 ఆకులతో ఆరోగ్యంగా ఉన్న మొక్కలను నాటుటకు ఎంపిక చేసుకోవాలి. నాటేటప్పుడు మాత్రమే మొక్కలను నర్సరీ నుంచి తీసుకురావాలి. సమాంతర త్రిభుజాకార పద్ధతిలో ఎకరాకు 57 మొక్కలు (హెక్టారుకు 143 మొక్కలు), చతురస్రాకార పద్ధతిలో ఎకరాకు 50 మొక్కలు (హెక్టారుకు 123 మొక్కలు) నాటుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

News December 31, 2025

ఒత్తు పొత్తును చెరుచు

image

ఒంటి ఎద్దుతో సేద్యం చేసేటప్పుడు నాగలి లేదా కాడిని ఎద్దు మెడపై సరిగా పెట్టకుండా, ఒక పక్కకే ఎక్కువ ఒత్తు (ఒత్తిడి) పడేలా చేస్తే, అది ఎద్దు మెడపై పొత్తు (చర్మం) దెబ్బతినడానికి, వాపు రావడానికి కారణమవుతుంది. అందుకే సేద్యం చేసేటప్పుడు కాడి భారం ఎద్దు భుజాలపై సమానంగా పడాలి. ఎద్దుకు నొప్పి కలిగితే అది సరిగా నడవలేదు, దీనివల్ల సేద్యం ఆలస్యమవుతుంది, పశువు పనికిరాకుండా పోయే ప్రమాదం ఉందని ఈ సామెత చెబుతుంది.

News December 31, 2025

ఒకరోజు ముందే పెన్షన్లు.. నేడు పంపిణీ!

image

AP: ప్రభుత్వం ప్రతినెలా ఒకటో తేదీ ఇచ్చే పెన్షన్లను ఒకరోజు ముందుగానే పంపిణీ చేయనుంది. ఇవాళ అందజేసేందుకు చర్యలు చేపట్టింది. కొత్త ఏడాది ప్రారంభం నేపథ్యంలో NTR భరోసా పెన్షన్ల పంపిణీ కోసం ప్రభుత్వం ముందుగానే రూ.2,743 కోట్లను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 63 లక్షల మందికిపైగా పెన్షన్‌దారులకు నేడు సచివాలయ సిబ్బంది ఇంటి వద్దే నగదు అందజేయనున్నారు. ఇవాళ తీసుకోని వారికి 2వ తేదీ పంపిణీ చేస్తారు.