News October 22, 2024
వినేశ్, బజరంగ్ స్వార్థంతో ఉద్యమానికి చెడ్డ పేరు: సాక్షి మాలిక్

రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడిగా బ్రిజ్‌భూషణ్‌ను తొలగించాలంటూ చేసిన ఉద్యమంలో తన సహచర రెజర్లు వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియాపై రెజ్లర్ సాక్షి మాలిక్ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘ఆసియా క్రీడల సెలక్షన్స్ నుంచి మినహాయింపు కోరడం వినేశ్, బజరంగ్ చేసిన పెద్ద తప్పు. అది మా నిరసనకు చెడ్డ పేరు తెచ్చింది. కొందరు వారిద్దరిలో స్వార్థం నింపి సొంత ప్రయోజనాల కోసం ఆలోచించేలా చేయగలిగారు’ అని తన పుస్తకం విట్నెస్లో వెల్లడించారు.
Similar News
News December 2, 2025
ప్రాణాలతో ఉండాలంటే దేశం నుంచి వెళ్లిపో: ట్రంప్

పదవి నుంచి దిగిపోయి, దేశం విడిచి వెళ్లిపోవాలని వెనిజుల అధ్యక్షుడు నికోలస్ మదురోకు US అధ్యక్షుడు ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. అలా చేస్తే ఆయన్ను, సన్నిహితులను ప్రాణాలతో వదిలేస్తామని చెప్పారు. ఫోన్ సంభాషణ సందర్భంగా ట్రంప్ హెచ్చరించారని ‘మియామి హెరాల్డ్’ చెప్పింది. ఈ ప్రతిపాదనకు ఆయన ఒప్పుకోలేదని తెలిపింది. ‘సార్వభౌమాధికారం, స్వేచ్ఛతో కూడిన శాంతి కావాలి. బానిస శాంతి కాదు’ అని మదురో చెప్పడం గమనార్హం.
News December 2, 2025
సుడిదోమ, పచ్చదోమ కట్టడికి లైట్ ట్రాప్స్

కొన్ని రకాల పురుగులు పంటలకు రాత్రి పూట కూడా హాని చేస్తుంటాయి. ఇలాంటి కీటకాలు రాత్రివేళ లైట్ కాంతికి బాగా ఆకర్షించబడతాయి. ఇలాంటి కీటకాలను ఆకర్షించి అంతచేసేవే ‘లైట్ ట్రాప్స్’. ముఖ్యంగా వరిలో సుడిదోమ, పచ్చదోమ నివారణకు ఈ లైట్ ట్రాప్స్ బాగా పనిచేస్తాయి. లైట్‌తో పాటు ఒక టబ్‌లో నీటిని పోసి దానిలో రసాయన మందును కలిపితే పురుగులు లైట్‌కి ఆకర్షించబడి మందు కలిపిన నీళ్లలో పడి చనిపోతాయి.
News December 2, 2025
‘PM ఆవాస్ యోజన-NTR’ పథకానికి దరఖాస్తు గడువు పెంపు

AP: నవంబర్ 30తో ముగిసిన PM ఆవాస్ యోజన గ్రామీణ (PMAY-G)-NTR పథకం దరఖాస్తు గడువును ప్రభుత్వం డిసెంబర్ 14 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దరఖాస్తు చేసుకునేందుకు గ్రామ/వార్డు సచివాలయాల్లో సంప్రదించాలని అధికారులు సూచించారు. ఈ పథకం కింద సొంత ఇల్లు లేని పేద కుటుంబాలకు గృహ నిర్మాణం కోసం రూ.2.50 లక్షల వరకు ఆర్థిక సాయం అందుతుంది. సొంత స్థలం లేని వారికి 3 సెంట్ల స్థలం, ఆర్థికసాయం అందజేస్తారు.


