News August 26, 2024
పోరాటం మిగిలే ఉందన్న వినేశ్ ఫొగట్

తన పోరాటం ముగియలేదని రెజ్లర్ వినేశ్ ఫొగట్ అన్నారు. సర్వ్ఖాప్ పంచాయతీ స్వర్ణ పతకంతో సన్మానించాక ఆమె మాట్లాడారు. ‘మన అమ్మాయిల గౌరవం కోసం అసలు పోరు ఇప్పుడే మొదలైంది. మేం ఢిల్లీలో కూర్చున్నప్పుడూ ఇదే చెప్పాం’ అని చెప్పారు. పారిస్ ఒలింపిక్స్లో డిస్క్వాలిఫై అవ్వగానే బాధపడ్డానని ఆమె అన్నారు. దేశానికి తిరిగొచ్చాక ఇక్కడి ప్రేమ, మద్దతు చూశాక అదృష్టవంతురాలిగా భావిస్తున్నానని పేర్కొన్నారు.
Similar News
News November 29, 2025
కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీప్రకాశ్ జైస్వాల్(81) కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్తో కాన్పూర్లో తుదిశ్వాస విడిచారు. ఈయన 2004-2009 వరకు హోంశాఖ సహాయ మంత్రిగా, 2011-2014 మధ్య కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు. కేంద్ర మంత్రి కావడానికి ముందు 2000-2002 వరకు ఈయన UPCC అధ్యక్షుడిగా సేవలందించారు. శ్రీప్రకాశ్ మృతి పట్ల కాంగ్రెస్ అగ్ర నేతలు సంతాపం తెలిపారు.
News November 29, 2025
నవంబర్ 29: చరిత్రలో ఈ రోజు

1759: గణిత శాస్త్రవేత్త నికోలస్ బెర్నౌలీ మరణం
1877: తొలిసారిగా థామస్ ఆల్వా ఎడిసన్ ఫోనోగ్రాఫ్ ప్రదర్శన
1901: చిత్రకారుడు, పద్మశ్రీ గ్రహీత శోభా సింగ్ జననం
1982: నటి, లోక్సభ మాజీ సభ్యురాలు రమ్య జననం
1993: పారిశ్రామికవేత్త జె.ఆర్.డి.టాటా మరణం(ఫొటోలో)
2009: తెలంగాణ కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభం
News November 29, 2025
GDP వృద్ధి.. దేశ పౌరులందరికీ ఉత్సాహాన్ని ఇచ్చే వార్త: CBN

2025-26 రెండో త్రైమాసికంలో దేశ GDP 8.2% వృద్ధి చెందడం ప్రతి పౌరుడికి ఉత్సాహాన్నిచ్చే వార్త అని CM CBN అన్నారు. ఈ వేగం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని నిలిపిందని హర్షం వ్యక్తం చేశారు. మోదీ నాయకత్వంలో దేశం వికసిత్ భారత్ లక్ష్యాల వైపు స్థిరంగా కొనసాగుతోందన్నారు. తాజా వృద్ధి తయారీ, నిర్మాణం, ఆర్థిక సేవలు తదితర రంగాలకు ప్రోత్సాహాన్ని ఇస్తుందని పేర్కొన్నారు.


