News July 7, 2024

‘గ్రాండ్ ప్రీ ఆఫ్ స్పెయిన్’లో వినేశ్ ఫోగట్‌కు స్వర్ణం

image

మ్యాడ్రిడ్‌లో జరిగిన గ్రాండ్ ప్రీ ఆఫ్ స్పెయిన్ పోటీలో భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్ 50 కిలోల విభాగంలో స్వర్ణం గెలుచుకున్నారు. శనివారం జరిగిన ఫైనల్‌లో రష్యా మాజీ రెజ్లర్ మరియా టియుమెరెకోవాను ఆమె ఓడించారు. టోర్నీ ఆసాంతం వినేశ్ అద్భుతంగా రాణించారు. కాగా.. ఈ ఏడాది పారిస్‌లో జరిగే ఒలింపిక్స్‌లో వచ్చే నెల 6న ఆమె తన తొలి మ్యాచ్ ఆడనున్నారు.

Similar News

News March 3, 2026

ఇవాళ స్టాక్ మార్కెట్లకు సెలవు

image

హోలీ పండగ నేపథ్యంలో ఈరోజు స్టాక్ ఎక్స్‌ఛేంజీలకు సెలవు ఉంటుంది. నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్ (BSE) మళ్లీ రేపు తెరుచుకుంటాయి. దీంతో ఇవాళ ఈక్విటీ, సెక్యూరిటీస్ ట్రేడింగ్ ఉండదు. ఇక MCX మార్కెట్ సాయంత్రం 5 గంటలకు ప్రారంభమై రా.11.30 వరకు కొనసాగుతుంది. ఇక ఈనెలలో శ్రీరామనవమి (మార్చి 26), మహావీర్ జయంతి (మార్చి 31) రోజుల్లో కూడా మార్కెట్ క్లోజ్ ఉంటుంది.

News March 3, 2026

నేడే చంద్రగ్రహణం.. ఎప్పుడు చూడొచ్చంటే?

image

ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణం మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభం కానుంది. అయితే మన దేశంలో ఈ గ్రహణం చివరి దశలో ఉన్నప్పుడే కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాలవారు సాయంత్రం 6.20 నుంచి 6.47 వరకు గ్రహణాన్ని చూడొచ్చు. కాగా గ్రహణం సందర్భంగా ఈరోజు ప్రధాన ఆలయాలు అన్ని మూతపడతాయి. ఇక భారత్ సహా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, అమెరికాలోనూ కనిపిస్తుంది.

News March 3, 2026

తమ్మినేనిపై సీపీఎం అభిశంసన

image

TG: CPM సీనియర్ నేత తమ్మినేని వీరభద్రాన్ని పార్టీ కేంద్ర కమిటీ అభిశంసింది. ఆయన రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న సమయంలో లాబీయింగ్, ప్రలోభాలు, ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారంది. ఇది రాష్ట్ర కమిటీ నిట్టనిలువునా చీలడానికి దారితీసిందని ఆగ్రహించింది. తమ్మినేనితో పాటు కమిటీ సభ్యులు స్కైలాబ్ బాబు, ప్రసాద్‌ పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని, వారిచ్చిన వివరణల్లోనూ ఆత్మవిమర్శ లోపించిందంటూ అభిశంసన చర్యలు చేపట్టింది.