News September 6, 2024

కాంగ్రెస్‌లోకి వినేశ్, పునియా.. సాక్షి స్పందనిదే..

image

వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా కాంగ్రెస్‌లో చేరడం వాళ్ల వ్యక్తిగతమని రెజ్లర్ సాక్షి మాలిక్ అన్నారు. తనకు కూడా రాజకీయ పార్టీల నుంచి ఆఫర్లు వచ్చాయని, కానీ వాటిని తిరస్కరించినట్లు చెప్పారు. రెజ్లింగ్‌లో మహిళల కోసం పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. రాబోయే హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ తరఫునా తాను ప్రచారం చేయనని సాక్షి తేల్చి చెప్పారు.

Similar News

News November 26, 2025

పల్నాడు: భారంగా మారిన పశుగ్రాసం..!

image

పల్నాడులో ఎక్కువగా వరి కోతకు యంత్రాలు వాడటం వలన వరిగడ్డి చిన్న ముక్కలై పొలంలోనే ఉండిపోవడంతో పశుపోషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రాసం దొరకని పరిస్థితి నెలకొనడంతో, పశువులకు గడ్డి అందించడం భారంగా మారింది. దీంతో మిర్యాలగూడ వంటి దూర ప్రాంతాల నుంచి అధిక ధరలకు వరిగడ్డిని కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ వరిగడ్డికి సుమారు రూ.15 వేలు ఖర్చవుతోందని రైతులు చెబుతున్నారు.

News November 26, 2025

బాలిస్టిక్ క్షిపణి పరీక్షించిన పాకిస్థాన్

image

యాంటీ షిప్ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు పాకిస్థాన్ మిలిటరీ ప్రకటించింది. ‘స్థానికంగా నిర్మించిన నేవల్ ప్లాట్‌ఫామ్ నుంచి మిస్సైల్ పరీక్షించాం. సముద్రం, భూమిపై ఉన్న లక్ష్యాలను ఇది అత్యంత కచ్చితత్వంతో ఛేదించగలదు. ఇందులో అత్యాధునిక గైడెన్స్ వ్యవస్థలు ఉన్నాయి’ అని పేర్కొంది. కాగా మే నెలలో భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ తర్వాతి నుంచి పాకిస్థాన్ ఈ తరహా ప్రయోగాలను పెంచింది.

News November 26, 2025

పుల్లోరం వ్యాధితో కోళ్లకు ప్రమాదం

image

వైరస్, సూక్ష్మజీవుల వల్ల కోళ్లలో పుల్లోరం వ్యాధి సోకుతుంది. కోడి పిల్లల్లో దీని ప్రభావం ఎక్కువ. తల్లి నుంచి పిల్లలకు గుడ్ల ద్వారా సంక్రమిస్తుంది. రోగం సోకిన కోడిపిల్లలు గుంపులుగా గుమికూడటం, శ్వాసలో ఇబ్బంది, రెక్కలు వాల్చడం, మలద్వారం వద్ద తెల్లని రెట్ట అంటుకోవడం వంటి లక్షణాలుంటాయి. కోడిని కోసి చూస్తే గుండె, కాలేయం, పేగులపై తెల్లని మచ్చలు కనిపిస్తాయి. నివారణకు వెటర్నరీ డాక్టర్ సలహాలను పాటించాలి.