News September 14, 2024
అప్పీల్‌కు వెళ్లేందుకు వినేశ్ ఒప్పుకోలేదు: సాల్వే

భారత ఒలింపిక్ సంఘంపై వినేశ్ ఫొగట్ <<14074375>>ఆరోపణల<<>> నేపథ్యంలో లాయర్ హరీశ్ సాల్వే స్పందించారు. ‘తన అనర్హతపై స్పోర్ట్స్ కోర్టులో తీర్పు అనుకూలంగా రాకపోవడంతో స్విస్ కోర్టుకు అప్పీలుకు వెళ్దామని వినేశ్‌కు సూచించాను. మాకు, వినేశ్ లాయర్లకు మధ్య సమన్వయం లోపించింది. ఆమెకు ఇక ముందుకు వెళ్లే ఉద్దేశం లేదని వారు చెప్పారు’ అని తెలిపారు. అయితే IOA నుంచి తనకు సహకారం అందలేదని వినేశ్ ఆరోపించారు.
Similar News
News November 24, 2025
చెరకు నరికిన తర్వాత ఆలస్యం చేస్తే..

చెరకు నరికిన తర్వాత రోజులు, గంటలు గడుస్తున్నకొద్దీ గడలలోని సుక్రోజ్ శాతం తగ్గుతుంది. ఈ గడలను గానుగాడించకుండా ఉంచితే.. నిల్వ కాలం పెరిగేకొద్దీ బరువు తగ్గుతుంది. చెరకు నరికిన తర్వాత 24 గంటలు ఆలస్యమైతే 1.5%, 48 గంటలు ఆలస్యమైతే 3%, 72 గంటలు ఆలస్యమైతే 5% వరకు దిగుబడిలో నష్టం జరుగుతుంది. అదే విధంగా రసనాణ్యతలోనూ 0.4%-0.6% వరకు క్షీణత కనిపిస్తుంది. నరికిన చెరకును నీడలో ఉంచితే ఈ నష్టం కొంత తగ్గుతుంది.
News November 24, 2025
పిల్లల ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారా?

ఇదివరకు పిల్లల ఫొటోలు, వీడియోలు కుటుంబం వరకే పరిమితమయ్యేవి. కానీ సోషల్‌మీడియా వచ్చిన తర్వాత పిల్లలకు సంబంధించిన ప్రతి విషయాన్నీ పేరెంట్స్ ప్రపంచంతో షేర్ చేసుకుంటున్నారు. అయితే ఇది సరికాదంటున్నారు నిపుణులు. పిల్లల ప్రైవసీని కాపాడటం తల్లిదండ్రుల బాధ్యత. పిల్లల ఫొటోలు, వివరాలు షేర్ చేయడం వల్ల మార్ఫింగ్, ఐడెంటిటీ థెఫ్ట్ వంటి ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సూచిస్తున్నారు.
News November 24, 2025
అమెరికా వీసా రాలేదని..

ట్రంప్ కఠిన వీసా నిబంధనలు తెలుగు డాక్టర్ మరణానికి కారణమయ్యాయి. US వీసా రాలేదని గుంటూరుకు చెందిన డా.రోహిణి HYDలో ఆత్మహత్య చేసుకున్నారు. MBBS చేసిన ఆమె USలో PG చేసేందుకు J1 వీసాకు దరఖాస్తు చేశారు. HYDలోని US కాన్సులేట్‌లో జరిగిన చివరి రౌండ్ ఇంటర్వ్యూలో ‘శాశ్వతంగా USలోనే ఉండిపోవాలనే ఉద్దేశం’ అని కారణాన్ని చూపుతూ రిజెక్ట్ చేశారు. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన రోహిణి సూసైడ్ చేసుకున్నారు.


