News August 31, 2024
రైతుల నిరసనలో పాల్గొననున్న వినేశ్?

దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు చేపట్టిన నిరసన నేటితో 200 రోజులు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగట్ రైతులకు మద్దతుగా నిరసనలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. రైతులను ఢిల్లీలోకి రాకుండా పోలీసులు అడ్డుకోవడంతో వారు శంభూ సరిహద్దులో ఫిబ్రవరి 13 నుంచి నిరసన కొనసాగిస్తున్నారు. అన్ని పంటలకు కనీస మద్దతు ధర విషయంలో చట్టపరమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
Similar News
News November 25, 2025
సౌతాఫ్రికా డిక్లేర్.. భారత్ టార్గెట్ 549

టీమ్ ఇండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది. బవుమా సేన 5 వికెట్లు కోల్పోయి 260 రన్స్ చేసింది. స్టబ్స్ 94 పరుగులు చేసి ఔట్ అయ్యారు. సౌతాఫ్రికా భారత్ ముందు 549 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

భర్తపై గృహ హింస కేసు పెట్టిన నటి

బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తన భర్త పీటర్ హాగ్పై గృహహింస కేసు పెట్టారు. ఆయన నుంచి రూ.50Cr నష్టపరిహారం ఇప్పించాలన్నారు. నెలకు తనకు రూ.10 లక్షలు మెయింటెనెన్స్ చెల్లించేలా ఆదేశించాలని ముంబై కోర్టును కోరారు. అంతేకాకుండా ముంబైలోని తన నివాసంలోకి హాగ్ను ప్రవేశించకుండా ముగ్గురు పిల్లలను తానే చూసుకునే అనుమతివ్వాలన్నారు. దీంతో కోర్టు హాగ్కు నోటీసులు జారీ చేసింది. జైట్లీ, హాగ్ 2011లో పెళ్లి చేసుకున్నారు.