News August 7, 2024
వినేశ్ అనర్హత.. పీటీ ఉషకి మోదీ ఫోన్

పారిస్ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్‌పై అనర్హత వేటు పడడంతో ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉషతో ఆయన ఫోన్లో మాట్లాడారు. వినేశ్ అనర్హతపై నిరసన తెలపాలని పీఎం సూచించారు.
Similar News
News December 4, 2025
నేడు ఆదిలాబాద్‌లో సీఎం రేవంత్ పర్యటన

TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఆదిలాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో రూ.500 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని మాట్లాడతారు. కాగా జిల్లాకు ఎయిర్‌పోర్టుపై ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. సీఎం పర్యటన నేపథ్యంలో 700 మంది పోలీసులతో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.
News December 4, 2025
సహజ ప్రసవాలు పెంచేందుకు ప్రత్యేక శిక్షణ

AP: సహజ ప్రసవాలు పెంచేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలకు సిద్ధమైంది. ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేసే గైనకాలజిస్టులకు ‘అసిస్టెడ్ వెజైనల్ డెలివరీ’ విధానంపై శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. వాక్యూం ఎక్ట్ర్సాక్షన్, ఫోర్సెప్స్తో సహజ ప్రసవాలు ఎలా చేయవచ్చో వివరిస్తామన్నారు. ఈ నెల 10 నుంచి 6 నెలల పాటు నిర్దేశించిన తేదీల్లో కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు.
News December 4, 2025
నేడు పఠించాల్సిన మంత్రాలు

1. అష్టైశ్వర్యాల కోసం: ‘‘ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్’’, ‘‘ఓం శ్రీ హ్రీం శ్రీ కమలే కమలాలయే ప్రసీదః’’, ‘‘శ్రీ హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మమాయై నమః’’
2. దత్తాత్రేయుని అనుగ్రహం కోసం: ‘‘ఓం దత్తాత్రేయ విద్మహే దిగంబరాయ ధీమహీ తన్నో దత్తాః ప్రోచోదయాత్’’
3. చంద్ర దోషం తగ్గిపోవడానికి: ‘‘ఓం సోమాయ నమః, ఓం ఐం క్లీం సౌమాయ నమః, ఓం శీతాంశు, విభాంశు అమృతాంశు నమః’’


