News March 22, 2025

వినోద్ కుమార్ శుక్లాకు జ్ఞానపీఠ్ అవార్డు

image

కేంద్ర ప్రభుత్వం 2025కు గాను జ్ఞానపీఠ్ అవార్డును ప్రకటించింది. ప్రఖ్యాత హిందీ రచయిత, కవి వినోద్ కుమార్ శుక్లా రచించిన ‘నౌకర్ కీ కమీజ్’ నవలను ఇందుకు ఎంపిక చేసింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఆయన 50 ఏళ్లుగా సాహిత్య సేవ చేస్తున్నారు.

Similar News

News January 30, 2026

వరాహ స్వామి, ఆదివరాహ స్వామి.. ఇద్దరూ ఒకరేనా?

image

వీరిద్దరూ ఒకే పరమాత్మ స్వరూపాలు. కానీ సందర్భాన్ని బట్టి పిలుస్తారు. సత్యయుగంలో భూమిని ఉద్ధరించడానికి విష్ణుమూర్తి ధరించిన అవతారాన్ని వరాహ స్వామి అంటారు. అయితే అన్ని వరాహ రూపాలకు మూలమైనవాడు, తిరుమల క్షేత్రంలో శ్రీవారి కన్నా ముందే వెలిసినవాడు కాబట్టి ఆయనను ఆది వరాహ స్వామి అంటారు. ‘ఆది’ అంటే మొదటివాడని అర్థం. ప్రళయ కాలంలో భూమిని రక్షించి, తిరిగి స్థాపించిన జగద్గురువుగా ఆయనకు ఈ విశిష్ట నామం దక్కింది.

News January 30, 2026

కొబ్బరి మొక్కల ఎంపికలో ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

కొబ్బరిలో అధిక దిగుబడి రావాలంటే మొక్కల ఎంపిక కీలకం. మొక్కల వయస్సు 10-12 నెలలు ఉన్న వాటిని ఎంపిక చేసుకోవాలి. ఆకుల సంఖ్య 6, అంతకంటే ఎక్కువ ఉండాలి. అలాగే మొక్క కాండం మొదలు చుట్టుకొలత పొట్టి రకానికి 8 సెం.మీ., పొడవు రకానికి 10 సెం.మీ. కంటే ఎక్కువ ఉండాలి. అలాగే మొక్క ఎత్తు పొట్టి రకాలకు 80 సెం.మీ. మరియు పొడవు, హైబ్రిడ్ మొక్కలకు 100 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉండాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

News January 30, 2026

ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో అప్రెంటిస్ పోస్టులు

image

ఒడిశా ఛాందీపుర్‌లోని <>DRDO<<>>కు చెందిన ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌ 7 టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. డిప్లొమా(ఎలక్ట్రానిక్స్ Engg.) అర్హత గలవారు FEB 4న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రాత పరీక్ష/పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు స్టైపెండ్ రూ.10,900 చెల్లిస్తారు. సైట్: https://www.drdo.gov.in