News April 3, 2025
ట్రెండింగ్లో ‘వింటేజ్ ఆర్సీబీ’

గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచులో ఓడిపోవడంతో ఆర్సీబీపై నెటిజన్లు SM వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు. తొలి రెండు మ్యాచుల్లో విజయం గాలివాటమేనని కామెంట్లు చేస్తున్నారు. మూడో మ్యాచులో పరాజయంతో ‘వింటేజ్ ఆర్సీబీ’ తిరిగి వచ్చేసిందని ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఈ ఒక్క పరాజయంతో తమ జట్టును తక్కువగా అంచనా వేయొద్దని, ఈ సారి కప్పు కొడతామని ఆర్సీబీ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News September 17, 2025
US జోక్యాన్ని భారత్ ఒప్పుకోలేదు: పాకిస్థాన్

OP సిందూర్ నిలిపివేయడం వెనుక అమెరికా హస్తంలేదని తాజాగా పాక్ ఉప ప్రధాని మహ్మద్ ఇషాక్ దార్ ఒప్పుకున్నారు. ‘మేము US విదేశాంగ మంత్రి మార్క్ రూబియోతో తృతీయ పక్షం జోక్యం గురించి చెప్పాం. బయటి వ్యక్తుల ప్రమేయానికి భారత్ ఒప్పుకోవట్లేదని ఆయన మాతో చెప్పారు. వాష్గింగ్టన్లో మళ్లీ నేను అదే ప్రస్తావించాను. ఇది పూర్తిగా ద్వైపాక్షికంగానే పరిష్కారమవ్వాలని ఇండియా తెగేసి చెప్పినట్లు బదులిచ్చారు’ అని తెలిపారు.
News September 17, 2025
దేశవ్యాప్తంగా 16చోట్ల NIA సోదాలు

AP: విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో NIA మరోసారి తనిఖీలు చేపట్టింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, UP, ఝార్ఖండ్, బిహార్, ఢిల్లీ, మహారాష్ట్రలో మొత్తం 16చోట్ల సోదాలు చేసింది. ఏపీలో నిర్వహించిన సోదాల్లో డిజిటల్ పరికరాలు, నగదు, అనుమానాస్పద వస్తువులు, డిజిటల్ పరికరాలు స్వాధీనం చేసుకుంది. జులై నెల VZMలో సిరాజ్ ఉర్ రెహ్మాన్ను NIA అరెస్టు చేయగా.. కేంద్రానికి వ్యతిరేకంగా కుట్ర పన్నినట్లు విచారణలో ఒప్పుకున్నాడు.
News September 17, 2025
మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండి: పవన్

AP: సమాజంలో వైషమ్యాలు సృష్టించే శక్తులు పేట్రేగిపోతున్నాయని కలెక్టర్లు, SPల సదస్సులో Dy.CM పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ‘సామాజిక వర్గాల మధ్య అంతరాలు సృష్టించే విద్రోహ శక్తుల పట్ల నిరంతర అప్రమత్తత అవసరం. CM చంద్రబాబు శాంతిభద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. మహిళల భద్రతకు ప్రాధాన్యమివ్వండి. సుగాలి ప్రీతి కేసుపై ప్రత్యేక శ్రద్ధ చూపండి. డ్రగ్స్ వ్యాప్తిపై ఉక్కుపాదం మోపాలి’ అని ఆదేశించారు.