News November 27, 2024
బంగ్లాలో హిందువులపై హింస.. పవన్ ఆందోళన
ఇస్కాన్ గురువు చిన్మయ్ కృష్ణదాస్‌ను బంగ్లాదేశ్ సర్కార్ అరెస్ట్ చేయడాన్ని అందరూ ఖండించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. హిందువులపై దాడులను ఆపాలని బంగ్లా ప్రభుత్వాన్ని కోరారు. బంగ్లా ఏర్పాటు కోసం భారత సైన్యం రక్తం చిందించిందని, ఎంతో మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. హిందువులను లక్ష్యంగా చేసుకుని హింసకు పాల్పడటం తీవ్రంగా కలచివేస్తోందని, ఈ విషయంలో UN కలగజేసుకోవాలని ట్వీట్ చేశారు.
Similar News
News November 27, 2024
KKR మరో టైటిల్ గెలుస్తుంది: ఉమ్రాన్ మాలిక్
తనను జట్టులోకి తీసుకున్నందుకు ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ KKRకు ధన్యవాదాలు తెలిపారు. ఆ జట్టు జెర్సీ ధరించడానికి ఆత్రుతతో ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. KKR డిఫెండింగ్ ఛాంపియన్స్ అని, మరో టైటిల్ గెలుస్తుందన్నారు. గతంలో SRHకు ఆడిన మాలిక్ తన వేగమైన బంతులతో అందరి దృష్టిని ఆకర్షించారు. నిలకడ లేమితో ఆ జట్టు వదులుకోగా వేలంలో తొలుత అన్‌సోల్డ్‌గా నిలిచారు, ఆపై KKR బేస్ ప్రైస్ రూ.75లక్షలకు దక్కించుకుంది.
News November 27, 2024
సోషల్ మీడియాలో 16ఏళ్ల లోపు పిల్లలు బ్యాన్!
ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడా లేని ఓ కీలక చట్టం అమలు చేయబోతోంది. సోషల్ మీడియాలో 16ఏళ్ల లోపు పిల్లలను బ్యాన్ చేసే బిల్లుకు అక్కడి ప్రతినిధుల సభ(102ఓట్లు అనుకూలం, 13వ్యతిరేకం)ఆమోదం లభించగా సెనెట్‌కు పంపింది. అక్కడ పాసై అమల్లోకి వస్తే టిక్‌టాక్, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు పిల్లల రిజిస్ట్రేషన్లను అడ్డుకోవాలి. లేకపోతే 50 మిలియన్ డాలర్ల ఫైన్ వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
News November 27, 2024
అదానీ కాకుంటే జగన్‌కు రూ.1750 కోట్ల లంచం ఎవరిచ్చినట్టు?
YS జగన్‌కు అదానీ రూ.1750 కోట్ల లంచం ఆరోపణల వివాదంలో మరో ట్విస్ట్. తమకు అదానీతో సంబంధం లేదని, సెకీతోనే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నామని జగన్ బృందం తెలిపింది. తమ ప్రతినిధులు భారత అధికారులకు లంచమిచ్చినట్టు US కోర్టులో అభియోగాలే నమోదవ్వలేదని తాజాగా అదానీ గ్రూప్ స్పష్టం చేసింది. అవి అజూర్ పవర్, CDPQ ప్రతినిధులపైనే ఉన్నాయంది. మరి జగన్ లంచం తీసుకున్నారా? తీసుకుంటే అదానీ కాకుండా ఎవరిచ్చినట్టు?