News August 4, 2024

బంగ్లాదేశ్‌లో మళ్లీ చెలరేగిన హింస.. 32 మంది మృతి

image

రిజర్వేషన్లపై చెలరేగిన <<13679462>>హింస<<>> చల్లారిందనుకున్న తరుణంలో మరోసారి బంగ్లాదేశ్‌లో ఘర్షణలు మొదలయ్యాయి. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది రోడ్డెక్కారు. ఈ క్రమంలో హసీనా మద్దతుదారులకు, నిరసనకారులకు మధ్య హింస చెలరేగింది. ఈ అల్లర్లలో ఇప్పటివరకు 32 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. ఈరోజు సా.6.30 నుంచి బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఇది అమలు కానుంది.

Similar News

News April 7, 2026

3 నెలల్లో మున్సిపాలిటీల్లో వార్డుల పెంపు: నారాయణ

image

AP: మహారాష్ట్ర, కేరళం, కర్ణాటకలోని మున్సిపాలిటీల్లో జనాభా ప్రాతిపదికన ఎన్ని వార్డులు ఉన్నాయనేది అధ్యయనం చేశామని మంత్రి నారాయణ తెలిపారు. ఇదే తరహాలో రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వార్డులు, డివిజన్లను 3 నెలల్లో పెంచుతామని ప్రకటించారు. పట్టణాల్లోని ప్రతి ఇంటికీ నీటి సరఫరాకు ₹14K కోట్లతో పనులు జరుగుతున్నాయన్నారు. జూన్ నాటికి మరో 40K టిడ్కో ఇళ్లను పంపిణీ చేస్తామని వెల్లడించారు.

News April 7, 2026

HPV వ్యాక్సిన్ వేయించుకున్నారా?

image

APలో 14-15 ఏళ్ల బాలికలకు ఉచిత HPV వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. తొలి దశలో కేంద్రం 1.9L డోసులను ఇవ్వగా ఇప్పటి వరకు 1.14L మందికి టీకాలు అందించింది. దీంతో వ్యాక్సిన్ పంపిణీలో దేశంలోనే రాష్ట్రం టాప్‌లో నిలిచింది. రెండో దశలో మరో 1.9L డోసులను కేంద్రం పంపింది. మే వరకు వ్యాక్సినేషన్ కొనసాగనుంది. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో టీకాలు వేస్తున్నారు. ఈ వ్యాక్సిన్లు పూర్తి సురక్షితమని అధికారులు చెబుతున్నారు.

News April 7, 2026

ఆసియా బ్యాడ్మింటన్.. భారత్ గోల్డ్ సాధించేనా?

image

చైనా వేదికగా నేటి నుంచి ఈ నెల 12 వరకు ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ జరగనుంది. భారత్ నుంచి మెన్స్ సింగిల్స్‌లో లక్ష్యసేన్, ప్రణయ్, శ్రీకాంత్, ఆయుష్, ఉమెన్స్ సింగిల్స్‌లో PV.సింధు, ఉన్నతి, తన్వి, మాళవిక బరిలో ఉన్నారు. డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్ టోర్నీ నుంచి తప్పుకున్నారు. మహిళల విభాగంలో గాయత్రి-ట్రీసా జాలీ పోటీ పడుతున్నారు. కాగా ఈ టోర్నీలో IND చివరగా 1965లో (దినేశ్ ఖన్నా) గోల్డ్ మెడల్ గెలిచింది.