News September 16, 2024
అమెరికాలో హింసకు చోటు లేదు: బైడెన్

అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్నకు సమీపంలో కాల్పులు జరగడంపై ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. USలో ఎటువంటి హింసకు తావు లేదని స్పష్టం చేశారు. ‘ఘటనపై అధికారులతో మాట్లాడాను. ఓ నిందితుడిని అరెస్ట్ చేశారు. ట్రంప్ సురక్షితంగా ఉన్నారని తెలిసి ఊరట కలిగింది. సీక్రెట్ సర్వీస్ చేస్తున్న కృషి అభినందనీయం. ట్రంప్ భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించాను’ అని పేర్కొన్నారు.
Similar News
News October 20, 2025
ఆనందపురంలో పండగ పూట విషాదం

పెందుర్తి నుంచి ఆనందపురం వైపు వెళ్తున్న బైక్ను సోమవారం ఉదయం వేగంగా వస్తున్న వ్యాన్ మామిడిలోవ వద్ద ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని భాధితులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News October 20, 2025
24 నుంచి బిహార్లో మోదీ ఎన్నికల ప్రచారం

ప్రధాని మోదీ ఈ నెల 24 నుంచి బిహార్లో ఎన్నికల ప్రచారం చేయనున్నట్లు ఆ రాష్ట్ర BJP వర్గాలు తెలిపాయి. 24న సమస్తీపూర్, బెగుసరాయ్లో జరిగే రెండు ర్యాలీల్లో ఆయన పాల్గొంటారని చెప్పాయి. తిరిగి 30న రెండు సభలకు హాజరవుతారని పేర్కొన్నాయి. నవంబర్ 2, 3, 6, 7వ తేదీల్లోనూ మోదీ ర్యాలీలు ఉంటాయని వివరించాయి. బిహార్ అసెంబ్లీకి నవంబర్ 6, 11వ తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే.
News October 20, 2025
పౌరాణిక కథల సమాహారం ‘దీపావళి’

దీపావళి జరపడానికి 3 పౌరాణిక కథలు ఆధారం. నరక చతుర్దశి నాడే కృష్ణుడు, సత్యభామ కలిసి నరకాసురుడిని సంహరించారు. అధర్మంపై ధర్మ విజయాన్ని స్థాపించారు. దీనికి గుర్తుగా దీపాలు వెలిగించారు. 14 ఏళ్ల వనవాసం తర్వాత రాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు కూడా ఇదే. ఆనాడు అయోధ్య ప్రజలు దీపాలు పెట్టి వారికి స్వాగతం పలికారు. క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవి ఉద్భవించింది కూడా ఈ తిథి నాడే. అందుకే లక్ష్మీదేవిని పూజిస్తారు.