News June 17, 2024

J&Kలో ఉగ్ర కలకలం.. భద్రతాబలగాల సెర్చ్ ఆపరేషన్

image

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కలకలం కొనసాగుతోంది. నిన్న బందిపొర జిల్లాలోని అడవిలో కాల్పుల శబ్దం వినిపించడంతో భద్రతాబలగాలు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టాయి. ఉగ్రవాదులు అడవిలో నక్కి ఉండొచ్చని భావిస్తున్నారు. కాగా ఇటీవల ఉగ్రదాడుల్లో రియాసిలో 9 మంది ప్రయాణికులు, కతువాలో ఓ జవాన్ మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం కశ్మీర్‌లో భద్రతపై నిన్న కీలక సమావేశం నిర్వహించారు.

Similar News

News January 17, 2025

పవన్ కళ్యాణ్ సమర్థవంతంగా పనిచేస్తున్నారు: నాదెండ్ల

image

AP: సూపర్ సిక్స్‌లో భాగంగా ఉచిత గ్యాస్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. త్వరలో ‘తల్లికి వందనం’ అమలు చేస్తామన్నారు. Dy.CM పవన్ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారని చెప్పారు. జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకుని ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున చెక్కులను పంపిణీ చేశారు. కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

News January 17, 2025

ఆటగాళ్లపై నిబంధనలు విధించిన BCCI

image

ఇటీవల టీమ్ ఇండియా పేలవ ప్రదర్శన దృష్ట్యా BCCI ఆటగాళ్లపై నిబంధనలు విధించింది. ప్లేయర్లు జాతీయ జట్టులో చోటు, సెంట్రల్ కాంట్రాక్ట్ పొందాలంటే దేశవాళీలో ఆడటం తప్పనిసరని పేర్కొంది. కుటుంబ సభ్యులను వెంట తీసుకొచ్చే విషయంలో కోచ్, సెలక్షన్ ఆమోదం ఉండాలని తెలిపింది. లగేజీ పరిమిత బరువు ఉండాలని పేర్కొంది. వ్యక్తిగత సిబ్బందిని అనుమతించబోమని, ముందుగానే ప్రాక్టీస్ సెషన్లు వీడొద్దని ప్లేయర్లకు స్పష్టం చేసింది.

News January 17, 2025

జనవరి 17: చరిత్రలో ఈరోజు

image

1908: సినీనిర్మాత, దర్శకుడు ఎల్.వి.ప్రసాద్ జననం
1917: సినీ నటుడు, తమిళనాడు మాజీ సీఎం ఎం.జి.రామచంద్రన్ జననం
1942: బాక్సింగ్ దిగ్గజం మహమ్మద్ అలీ జననం
1945: తెలంగాణ కవి, రచయిత మడిపల్లి భద్రయ్య జయంతి
2010: బెంగాల్ మాజీ సీఎం జ్యోతిబసు మరణం
1989: దక్షిణ ధృవాన్ని చేరుకున్న తొలి భారతీయుడు కల్నల్ జె.కె బజాజ్