News January 6, 2025
7న తిరుమలలో VIP బ్రేక్ దర్శనాలు రద్దు
AP: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఏర్పాట్లు చేసింది. జనవరి 10-19 వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నారు. ద్వార దర్శనాలను పురస్కరించుకుని జనవరి 7న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. దీంతో ఆ రోజు VIP బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. 6న సిఫార్సు లేఖలను స్వీకరించబోమని ఓ ప్రకటనలో తెలిపింది.
Similar News
News January 7, 2025
పెళ్లిలో మందు, డీజే లేకపోతే రూ.21వేల బహుమతి
వివాహాల్లో మద్యం, డీజే సాధారణంగా మారిపోయాయి. వీటితో ఆనందంతో పాటు అవతలి వారికి అసౌకర్యం కూడా ఉంటుంది. ఈ ఇబ్బందిని తగ్గించేలా పంజాబ్‌లోని బఠిండా జిల్లా బల్లా గ్రామ పెద్దలు వినూత్న ఆఫర్ ప్రకటించారు. మద్యం, డీజే లేకుండా పెళ్లి చేసుకున్న వారికి రూ.21వేలు బహుమతిగా ఇస్తున్నారు. వృథా ఖర్చును తగ్గించేందుకే ఈ పథకం ప్రారంభించినట్లు సర్పంచ్ అమర్‌జిత్ కౌర్ తెలిపారు.
News January 7, 2025
బీజేపీ నేతలు వాస్తవాలు తెలుసుకోవాలి: భట్టి
TG: బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ యువజన కార్యకర్తల దాడి ఘటనపై Dy.CM భట్టి విక్రమార్క స్పందించారు. భారత సంస్కృతి గురించి గొప్పలు మాట్లాడే బీజేపీ నేతలు ప్రియాంకపై చేసిన వ్యాఖ్యలు సిగ్గుపడేలా ఉన్నాయని మండిపడ్డారు. ఆవేశంలో BJP కార్యాలయంపై చేసిన దాడిని పార్టీ పెద్దలంతా ఖండించినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీది అహింస సంస్కృతి అన్నారు. దాడి విషయంలో కాషాయ నేతలు వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు.
News January 7, 2025
ఫార్ములా ఈ కేసు.. రేపు విచారణకు అరవింద్
TG: ఫార్ములా ఈ-కారు రేసు కేసులో రేపు కీలక పరిణామం జరగనుంది. అరవింద్ కుమార్ రేపు ACB విచారణకు హాజరుకానున్నారు. ఈ కేసులో A-2గా ఉన్న ఆయన తన పరిధిలోని HMDA నుంచి FEOకు నిధులు బదిలీ చేశారు. KTR ఆదేశాలతోనే నిధులు బదిలీ చేసినట్లు గతంలో అరవింద్ వివరణ ఇవ్వగా, రేపు ఆయన వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేయనున్నారు. ఆయన స్టేట్‌మెంట్ ఆధారంగా KTRను ACB తర్వాత విచారించే అవకాశం ఉంది.