News October 30, 2024
రేపు తిరుమలలో వీఐపీ దర్శనాలు రద్దు
AP: తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు దీపావళి ఆస్థానం సందర్భంగా వీఐపీ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే దర్శనం కల్పించనుంది. ఇటు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 59,140 మంది దర్శించుకోగా 16,937 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.31 కోట్లు లభించింది.
Similar News
News October 30, 2024
నూతన ఏపీ భవన్ నిర్మాణానికి టెండర్లు
ఢిల్లీలో నూతన ఏపీ భవన్‌ను నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రీ డెవలప్మెంట్ ఆఫ్ ఏపీ భవన్ పేరుతో డిజైన్లకు టెండర్లను పిలిచింది. 11.53 ఎకరాల్లో నిర్మాణం చేపట్టనుంది. ప్రస్తుతం ఉన్న భవనాలను రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి వినియోగించుకుంటున్నాయి. అయితే ఎన్నికలకు ముందు ఇరు రాష్ట్రాల అధికారులు భవన్ విభజనను ఖరారు చేసుకుని ప్రతిపాదనలు పంపగా కేంద్ర హోం శాఖ ఆమోదం తెలిపింది.
News October 30, 2024
పరువు నష్టం కేసు విచారణ వాయిదా
TG: మంత్రి సురేఖపై KTR వేసిన పరువునష్టం దావాపై విచారణను కోర్టు నవంబర్ 13కు వాయిదా వేసింది. నాంపల్లి కోర్టు మెజిస్ట్రేట్ సెలవులో ఉండటంతో ఇన్‌ఛార్జి జడ్జి పిటిషన్ విచారణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కాగా నాగచైతన్య-సమంత విడాకులకు కేటీఆర్ ఓ కారణం అంటూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తన పరువుకు నష్టం కలిగించాయని KTR ఈ దావా వేసిన విషయం తెలిసిందే. నాగార్జున వేసిన పిటిషన్‌పైనా విచారణ వాయిదా పడింది.
News October 30, 2024
కన్నడ నటుడు దర్శన్‌కి మధ్యంతర బెయిల్
కన్నడ నాట సంచలనం సృష్టించిన రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడైన నటుడు దర్శన్‌కు మధ్యంతర బెయిల్ లభించింది. వెన్నెముక శస్త్రచికిత్స కోసం బెయిల్ ఇవ్వాలని ఆయన కోరడంతో న్యాయస్థానం అంగీకరించింది. 6 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. మరోవైపు రెగ్యులర్ బెయిల్ కోసం దర్శన్ పిటిషన్ దాఖలు చేశారు. కాగా రేణుకా స్వామి మర్డర్ కేసులో జూన్ 11న దర్శన్ అరెస్టయిన సంగతి తెలిసిందే.