News March 30, 2024
VIRAL.. ఓట్ల కోసం మా కాలనీలోకి రావొద్దంటూ ఫ్లెక్సీ
ఎన్నికల వేళ ఏలూరులో ఓ కాలనీవాసులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శాంతినగర్ 7వ లైన్ కాలనీవాసులు ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఏ రాజకీయ పార్టీ నాయకులు తమ వీధిలోకి ఓట్లు అడగటానికి రావద్దని, 20ఏళ్ల నుంచి తమ కాలనీని ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. ఓట్ల కోసం తప్ప గెలిచిన తర్వాత కాలనీ వైపు తొంగిచూసిన వారే లేరని, డ్రైనేజ్ తీయకపోవడంతో రోగాల బారిన పడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News January 25, 2025
పశువధను నిలిపివేయాలని కలెక్టర్‌కి మహిళలు విజ్ఞప్తి
తణుకు మండలం తేతలిలో లేహం ఫుడ్స్ పేరుతో నిర్వహిస్తున్న పశువధ కర్మాగారాన్ని మూసివేయాలని కోరుతూ స్థానిక మహిళలు జిల్లా కలెక్టర్ నాగరాణికు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం రాత్రి తణుకులోని రామకృష్ణ సేవా సమితి భవనంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కలెక్టర్ నాగరాణిను కలిసిన వారు తణుకులో పశు వధ కర్మగారం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు.
News January 25, 2025
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్..
ఫిబ్రవరి ఒకటో తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తణుకు పట్టణంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి , జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డిలతో కలిసి తేతలి, మండపాక లేఔట్లను, ఎస్ ఎన్ వి ఎం పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలోని హెలి ప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని అన్నారు.
News January 24, 2025
ఏలూరు: రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద హైవేపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఇద్దరు స్నేహితులు విజయవాడ నుంచి ఏలూరు వైపు బైక్‌పై వెస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బైక్‌కు లారీ తగలడంతో అదుపుతప్పి ఇద్దరూ కిందపడ్డారు. క్రాంతికుమార్ తలపై నుంచి లారీ వెనక టైర్లు ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఏలూరు జిల్లా పెదపాడు (మ)కడిమికొండ గ్రామ వాసిగా గుర్తించారు.