News September 29, 2024

VIRAL: హైదరాబాద్‌లో సరస్సులు.. ఎంత బాగుండేనో..!

image

HYDRAA కూల్చివేతలు కొనసాగుతున్న నేపథ్యంలో 1879లో రూపొందించిన హైదరాబాద్ సరస్సుల చారిత్రక చిత్రాలు వైరల్ అయ్యాయి. పరిశోధకుడు అసిఫ్ అలీ ఖాన్ ఈ చిత్రాలను పంచుకుని నగరానికి చెందిన పూర్వ చరిత్రను వెలుగులోకి తెచ్చారు. హుస్సేన్ సాగర్, మిర్ ఆలమ్ ట్యాంక్, సరూర్ నగర్ సరస్సులపై ప్రత్యేకంగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కలుషితమైన ఈ సరస్సులను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.

Similar News

News November 23, 2025

GHMC: సీసీ రోడ్ల పెండింగ్.. ఈ 3 జోన్లలో అధికం

image

​ఖైరతాబాద్ జోన్‌లో మొత్తం 506 పనులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటి విలువ రూ.14,042.7 లక్షలు. 27 BT రోడ్ల పనుల్లో కేవలం 4 మాత్రమే పూర్తయ్యాయి!​చార్మినార్ జోన్‌లో 728 పనులు పెండింగ్‌లో ఉన్నాయి. విలువ రూ.13,556.93 లక్షలు. ఇక్కడ కూడా CC పనుల బకాయి రూ.12,778.78 లక్షలుగా ఉంది.​ LBనగర్ జోన్‌లో రూ.11,446.4 లక్షల విలువైన 175 పనులు మిగిలి ఉన్నాయి.​ <<18363545>>ఈ మూడు జోన్లలో<<>>ని రోడ్ల సమస్యలపై ప్రజాగ్రహం తప్పేలా లేదు.

News November 23, 2025

నగరానికి CC శాపం.. బడ్జెట్‌కు భారం!

image

పెండింగ్‌ పనుల్లో సిమెంట్ కాంక్రీట్ (CC) రోడ్ల వాటా ఊహించని విధంగా ఉంది. ఈ కీలకమైన పనుల్లో జాప్యం వల్లే మొత్తం ఆర్థిక భారం పెరిగిపోయింది: ​1,952 CC రోడ్ల పనులు పూర్తి కావాల్సి ఉంది. <<18363524>>వీటి అంచనా వ్యయం<<>> రూ.54,384.26 లక్షలు (సుమారు ₹543 కోట్లు). కేవలం 110 BT పనులకే రూ.6,419.91 లక్షలు పెండింగ్ ఉంది. మొత్తం రూ.608 కోట్ల పెండింగ్‌లో రూ.543 కోట్లు సీసీ రోడ్లకే కావడం గమనార్హం. ​

News November 22, 2025

తీవ్ర పోటీ: రంగారెడ్డి DCC పెండింగ్!

image

AICC కొత్తగా DCC ప్రెసిడెంట్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిని నియమించకపోవడం చర్చనీయాంశమైంది. RCపురానికి చెందిన దేప భాస్కర్ రెడ్డి, బడంగ్‌పేట మాజీ మేయర్ చిగురింత నర్సింహా రెడ్డి, చేవెళ్ల నుంచి భీంభరత్, ఎల్బీనగర్ నేత రాంమోహన్ గౌడ్, షాద్‌నగర్ నుంచి మాజీ MLA ప్రతాప్ రెడ్డి DCC ఆశించినట్లు తెలిసింది. పెండింగ్‌లో ఉంచడానికి తీవ్ర పోటీ ప్రధాన కారణమని సమాచారం.