News November 24, 2025

VIRAL: 6 నెలల నిరీక్షణ తర్వాత తల్లి చెంతకు..!

image

ముంబై రైల్వే స్టేషన్‌లో మే 20న అదృశ్యమైన నాలుగేళ్ల ఆరోహి, ఆరు నెలల అంధకారం తర్వాత తల్లి ఒడికి చేరింది. మే 20న స్టేషన్‌లో తల్లి నుంచి ఆరోహి కిడ్నాప్‌కు గురైంది. వారణాసిలోని అనాథాశ్రమానికి చేరిన ఆ చిన్నారిని, పోలీసులు వేసిన పోస్టర్ల ఆధారంగా ఓ రిపోర్టర్ గుర్తించారు. ముంబైకి తిరిగి వచ్చిన ఆరోహి.. తన తల్లిదండ్రుల కంటే ముందుగా అక్కడున్న పోలీసు అధికారులను కౌగిలించుకోవడం అందరినీ కంటతడి పెట్టించింది.

Similar News

News November 26, 2025

నల్గొండ: సర్పంచ్ ఎన్నికలు.. ఇదీ లెక్క

image

సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. ఓట్ల పండుగకు వేళయింది. వచ్చే నెల 11, 14, 17 మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలో మొత్తం 869 జీపీలుండగా, 7,494 వార్డులున్నాయి. 10,73,506 మంది ఓటర్లున్నారు. అందులో 5,30,860 మంది పురుషులు ఉండగా, 5,42,589 మంది మహిళలున్నారు. 57 మంది ట్రాన్స్‌జెండర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

News November 26, 2025

వైకుంఠద్వార దర్శనాలు.. టోకెన్ల బుకింగ్ ఇలా!

image

AP: తిరుమలలో <<18389057>>వైకుంఠద్వార<<>> దర్శనాల(DEC 30-JAN 8) కోసం ఈ నెల 27న 10AM నుంచి ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ మొదలవుతుంది. TTD వెబ్‌సైట్, యాప్‌తోపాటు 9552300009 వాట్సాప్ నంబర్‌తోనూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. భక్తులు హాయ్ లేదా గోవిందా అని మెసేజ్ చేస్తే దర్శనాల ఆప్షన్ కనిపిస్తుంది. DEC 30, 31, JAN 1 తేదీల్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాలి. డిసెంబర్ 1న 5PM వరకు అవకాశం ఉంటుంది. డిసెంబర్ 2న 2PMకు టోకెన్లు కేటాయిస్తారు.