News September 25, 2024

VIRAL: ఆఫీస్ కుర్చీలో కూర్చొని ఆటో డ్రైవింగ్!

image

బెంగళూరులో ఓ ఆటో డ్రైవర్ ఆటోలోని సీటును తొలగించి, ఆఫీసు కుర్చీని బిగించుకున్నారు. అందులో కూర్చొని డ్రైవ్ చేస్తున్నారు. దీనిని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఆయనకు బ్యాక్ పెయిన్ వచ్చి అలా చేశారేమో అంటూ పలువురు నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఇది మోటార్ వెహికల్ యాక్ట్‌కు విరుద్ధమని పేర్కొంటున్నారు.

Similar News

News September 25, 2024

ఈ సిటీల్లో నాన్ వెజ్ ముట్టుకోరు!

image

అసలు మాంసాహారమే ముట్టుకోని నగరాలు కూడా భారత్‌లో ఉన్నాయి. శ్రీరాముడు జన్మించినట్లు చెప్పే అయోధ్య, కృష్ణుడు తిరుగాడినట్లు చెప్పే బృందావనం, నరనారాయణులు తపస్సు చేసిన రిషీకేశ్, జైనులకు పవిత్రమైన పాలిటానా, మౌంట్ అబూ, బ్రహ్మదేవుడి ఆలయానికి పేరొందిన పుష్కర్ నగరాల్లో నాన్ వెజ్ నిషేధం. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో నిషేధం లేకపోయినా అక్కడి వారు స్వచ్ఛందంగా మాంసాహారానికి దూరం పాటిస్తారు.

News September 25, 2024

ధర్మాచరణకు మా నాయకుడు సరైన ఉదాహరణ: నాగబాబు

image

హైందవ ధర్మాన్ని పవన్ కళ్యాణ్ అమితంగా నమ్ముతారని నాగబాబు ట్విటర్‌లో తెలిపారు. ‘కలియుగంలో ధర్మం ఒక పాదం మీదే నడుస్తుంది. ఒక పాదమే అయినా ఆ నడక బలంగా ఉండేందుకు నా వంతు పాత్ర పోషిస్తాను. నా ప్రయత్నం సంపూర్ణంగా చేస్తాను అని చాలాకాలం క్రితం కళ్యాణ్ బాబు నాతో చెప్పిన మాట. ధర్మాచరణకు తను సరైన ఉదాహరణ. అది ఈరోజు మళ్లీ నిరూపితమైంది’ అని అందులో పేర్కొన్నారు.

News September 25, 2024

భక్తుల సూచనల కోసం కాల్ సెంటర్ ఏర్పాటు: MLA సుజనా

image

AP: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాల పోస్టర్‌ను ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే సుజనా చౌదరి, వెనిగండ్ల రాము ఆవిష్కరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే సుజనా చెప్పారు. భక్తుల సూచనల కోసం కాల్ సెంటర్ సైతం అందుబాటులోకి తెస్తామన్నారు. కాగా అక్టోబర్ 3 నుంచి 12 వరకు ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు.