News November 8, 2024
VIRAL: యమునా నదిలో చిన్నారికి స్నానం
కాలుష్య కారకాలతో యమునా నది నిండిపోయింది. నదీ జలాలు విషపు నురుగుతో నిండిపోవడంతో ఛట్ పూజలు చేసేందుకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈక్రమంలో ఓ తండ్రి తన బిడ్డతో నదిలో స్నానం చేస్తోన్న ఫొటోలు వైరలవుతున్నాయి. ఆ చిన్నారిని నురుగు కప్పేయడంతో అక్కడి పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో తెలుస్తోంది. ఇలాంటి నీళ్లలో స్నానం చేయడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Similar News
News November 8, 2024
తిరుమలను UTగా చేయాలన్న కేఏ పాల్ పిటిషన్ డిస్మిస్
AP: లడ్డూ వివాదం నేపథ్యంలో తిరుమలను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని KA పాల్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఈ అంశంలో రాజకీయం నడుస్తోందని, దేశ ప్రతిష్ఠను కాపాడటానికి పిల్ వేశానని పాల్ పేర్కొన్నారు. దీనిప్రకారం అన్ని ఆలయాలు, గురుద్వారాలను ప్రత్యేక రాష్ట్రాలుగా చేయాల్సి ఉంటుందని బెంచ్ అభిప్రాయపడింది. ప్రస్తుతం సిట్ విచారణకు ఆదేశించామని పేర్కొంటూ పిటిషన్ను కొట్టేసింది.
News November 8, 2024
మంచి జీవితం కోసం కొన్ని గుడ్ హ్యాబిట్స్
పారిశ్రామిక వేత్త హర్ష గోయెంకా తరచూ జీవిత సూత్రాలను సోషల్ మీడియాలో పంచుకుంటుంటారు. జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి కొన్నింటిని అలవాటు చేసుకోవాలని తాజాగా సూచించారు. > నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని 80/20 పద్ధతిలో తినండి. రోజూ వ్యాయామం చేయండి. పుస్తకాలు చదవండి. కృతజ్ఞతగా ఉండటాన్ని పాటించండి. మీ రోజును ప్లాన్ చేసుకోండి. లక్ష్యాలను సెట్ చేయండి. మీ భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టండి.
News November 8, 2024
తిరుమలలో అన్యమతస్థులపై వేటు?
AP: తిరుమలలో అన్యమతస్థుల అంశం ఎప్పటి నుంచో వివాదాస్పదంగా ఉంది. గతంలో అన్యమత ఉద్యోగులను గుర్తించి జాబితా రెడీ చేశారు. అయితే వారిని తిరుమల నుంచి తప్పించే చర్యలు మాత్రం ముందుకు సాగలేదు. ఇటీవల టీటీడీ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టిన బీఆర్ నాయుడు ఈ విషయంపై సీరియస్గా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. త్వరలోనే అన్యమతస్థుల స్వచ్ఛంద బదిలీలకు అవకాశం కల్పించి పంపించాలని కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.