News July 22, 2024

VIRAL: పెళ్లైన 3 నిమిషాలకే విడాకులు

image

కువైట్‌లో ఓ జంట పెళ్లైన 3 నిమిషాలకే విడాకులకు దరఖాస్తు చేసింది. పెళ్లి వేడుక నుంచి వెళ్తుండగా వధువు బ్యాలెన్స్ తప్పి పడిపోయింది. దాంతో ఆమెను స్టుపిడ్ అని వరుడు దూషించాడు. అది విన్న వధువు వెంటనే అతనికి విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకొని కోర్టును ఆశ్రయించింది. విచారణ ముగిశాక కోర్టు విడాకులు మంజూరు చేసింది. 2019లో జరిగిన ఈ ఘటన తాజాగా వైరలవుతోంది. కువైట్ చరిత్రలో అతి స్వల్పకాల వివాహ బంధమని చెబుతున్నారు.

Similar News

News January 23, 2026

పాల్వంచ: ‘మన ఇసుక వాహనం’పై కలెక్టర్ సమీక్ష

image

తెలంగాణ రాష్ట్రంలో ఇసుక రవాణా, సరఫరా వ్యవస్థను పూర్తిగా పారదర్శకంగా, నియంత్రిత విధానంలో అమలు చేయాలనే స్పష్టమైన లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఇసుక వాహనం’ ఆన్‌లైన్ సాండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. ఇసుక అక్రమ రవాణా, నిల్వలు, అవినీతి వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ఈ కొత్త విధాన ఉద్దేశమని స్పష్టం చేశారు.

News January 22, 2026

ముగిసిన దావోస్ పర్యటన.. అమెరికాకు CM రేవంత్

image

TG: ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధుల బృందం దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసినట్లు ప్రభుత్వం తెలిపింది. 3 రోజుల WEFలో ఆశించిన లక్ష్యాన్ని సాధించినట్లు పేర్కొంది. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్లు, క్లీన్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులు వచ్చాయని, AI, సస్టైనబిలిటీ, స్కిల్లింగ్ అంశాలపై MoUలు కుదిరాయని వెల్లడించింది. మరోవైపు దావోస్‌లో కార్యక్రమాలు ముగించుకొని CM రేవంత్ <<18905782>>అమెరికా పర్యటన<<>>కు వెళ్తున్నారు.

News January 22, 2026

పడుకునే ముందు నీళ్లు తాగడం మంచిదేనా?

image

పడుకునే ముందు నీళ్లు తాగడం వల్ల ప్రయోజనాలతో పాటు ఇబ్బందులూ ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ‘శరీర ఉష్ణోగ్రత నియంత్రణతో పాటు రక్త ప్రసరణ మెరుగుపడి హాయిగా నిద్ర పడుతుంది. శరీరంలోని వ్యర్థాల తొలగింపునకు సహాయపడుతుంది. అయితే ఎక్కువగా తాగితే మాటిమాటికీ మూత్ర విసర్జనకు లేవాల్సి రావడం వల్ల నిద్రకు భంగం కలగవచ్చు. గుండె, కిడ్నీ సమస్యలున్నవారు నిద్రకు 1-2 Hr ముందే నీళ్లు తాగడం ఉత్తమం’ అని సూచిస్తున్నారు.