News December 31, 2024
VIRAL: ‘హ్యాపీ న్యూ ఇయర్ అని WhatsAppలో పెట్టకండి’

కోట్లాది మంది ప్రజలు నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమవుతుంటే కొందరు సెలబ్రేషన్స్ చేసుకోవద్దని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ‘ఈ రోజు నుంచి జనవరి 2 వరకు గ్రూప్లో ఎవరూ నూతన సంవత్సర వేడుక, శుభాకాంక్షలు అంటూ పోస్ట్లు చేయకూడదు అని ప్రార్థన’ అనే WhatsApp మెసేజ్ చక్కర్లు కొడుతోంది. జనవరి 1ని బహిష్కరిద్దామని పిలుపునిస్తున్నారు. ‘జనవరి వద్దు.. ఉగాది ముద్దు’ అని అంటున్నారు. దీనిపై మీ కామెంట్?
Similar News
News January 27, 2026
త్వరలో ATMలలో చిన్న నోట్లు.. ఛేంజ్ కూడా తీసుకోవచ్చు!

₹10, 20, 50 వంటి చిన్న నోట్ల చెలామణీ పెంచేందుకు కొత్త ATMలను తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. ₹500, ₹100తోపాటు చిన్న నోట్లు విత్ డ్రా చేసుకునేలా ప్లాన్ చేస్తున్నట్లు Mint తెలిపింది. ముంబైలో పరీక్షిస్తున్నారని, ఆమోదం వస్తే దేశమంతటా అమలు చేస్తారని సమాచారం. ATMలో ఛేంజ్ తీసుకునే అంశాన్నీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఉదాహరణకు మన దగ్గర ఉన్న ₹500 నోటును అందులో ఉంచి, ఐదు ₹100 నోట్లను తీసుకోవచ్చు.
News January 27, 2026
రేపు JEE మెయిన్… ఈ జాగ్రత్తలు తప్పనిసరి

రేపు, ఎల్లుండి JEE మెయిన్ పరీక్షలు జరుగనున్నాయి. దేశవ్యాప్తంగా 15L మంది వరకు వీటికి హాజరుకానున్నారు. ఉ.9-12 వరకు ఫస్ట్ సెషన్, మ.3-6 వరకు రెండో సెషన్ ఉంటుంది. APలో 30, TGలో 14 పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు. కాగా అభ్యర్థులు తమతో పాటు అడ్మిట్ కార్డు, సెల్ఫ్ డిక్లరేషన్, పాస్పోర్టు సైజ్ ఫొటో, ఒరిజినల్ స్కూల్ ఐడీ లేదా ఇతర ఫొటో IDని తీసుకెళ్లాలి. NTA నిషేధిత వస్తువుల్ని తీసుకుపోరాదు.
News January 27, 2026
‘మల దానం’తో యువకుడికి ₹3.4 లక్షల ఆదాయం.. దాంతో ఏం చేస్తారు?

కెనడాకు చెందిన ఓ యువకుడు తన ‘మల దానం’ ద్వారా 2025లో ₹3.4 లక్షలు సంపాదించారు. వింతగా ఉన్నా ఇది Faecal Microbiota Transplantation చికిత్సకు చాలా కీలకం. ఆరోగ్యవంతుడైన దాత మలంలోని మంచి బ్యాక్టీరియాను సేకరించి Clostridioides difficile అనే ఇన్ఫెక్షన్తో బాధపడే రోగుల పేగుల్లోకి ఎక్కిస్తారు. తద్వారా వారి జీర్ణవ్యవస్థలో బ్యాక్టీరియాను బ్యాలెన్స్ చేస్తారు. ఈ యువకుడి దానం వల్ల 400 మంది ప్రాణాలు దక్కాయి.


