News July 11, 2024

VIRAL: ‘రోడ్లు బాగు చేయకుంటే ఫ్యామిలీతో సూసైడ్ చేసుకుంటా..!’

image

TG: రోడ్లు బాగుచేయాలని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని ఓ యువకుడు కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. మహబూబాబాద్ జిల్లా మరిపెడలోని పూలబజార్‌లో రోడ్లు బురదమయంగా మారాయి. దీంతో ముక్తార్ అనే వ్యక్తి రోడ్ల ఫొటోలు, వీడియోలు తీసి ‘దోమలతో ఎలాగూ రోగాల పాలవుతున్నాం. అదెదో మందు తాగి చనిపోతే పనైపోతుంది’ అని ఎమ్మెల్యే, కలెక్టర్, కమిషనర్‌కు షేర్ చేశారు.

Similar News

News January 19, 2025

100 మందిలో ఒకరికి క్యాన్సర్!

image

AP: రాష్ట్రంలో 100 మందిలో ఒకరు క్యాన్సర్ అనుమానితులుగా ఉన్నట్లు ప్రభుత్వ స్క్రీనింగ్ పరీక్షల్లో తేలింది. ఇప్పటివరకు 53.07 లక్షల మందికి టెస్టులు చేయగా 52,221 మంది క్యాన్సర్ అనుమానితులు ఉన్నారని ఆరోగ్యశాఖ గుర్తించింది. నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ అనుమానితులే ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. ఈ స్క్రీనింగ్ పరీక్షలను ప్రజలందరూ ఉపయోగించుకోవాలని ఆరోగ్యశాఖ సూచించింది.

News January 19, 2025

వచ్చే నెల 12 నుంచి మినీ మేడారం

image

TG: మేడారంలో ప్రతి రెండేళ్లకోసారి సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుందనే సంగతి తెలిసిందే. అయితే మరుసటి ఏడాది నిర్వహించే మండమెలిగె పండుగను మినీ మేడారంగా భక్తులు పిలుస్తారు. వచ్చే నెల 12 నుంచి 15 వరకు ఈ జాతర జరగనుంది. దీని కోసం రూ.32 కోట్లతో అధికారులు అభివృద్ధి పనులు చేపట్టారు. సుమారు 20 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు.

News January 19, 2025

బడ్జెట్ సమావేశాల్లో కొత్త ఆదాయపు పన్ను చట్టం!

image

వచ్చే బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఆదాయపు పన్ను చట్టం-1961 స్థానంలో తేలిగ్గా అర్థం చేసుకునే విధంగా ఈ ప్రతిపాదిత బిల్లు ఉండనుంది. ప్రస్తుత చట్టంలో 298 సెక్షన్లు, 23 చాప్టర్లు ఉన్నాయి. కాగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి.