News July 14, 2024

VIRAL: జగన్నాథుడే ట్రంప్‌ను రక్షించాడు

image

US మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను పూరీ జగన్నాథుడే రక్షించారని పలువురు పోస్టులు చేస్తున్నారు. దీంతో ఇదే నిజమని కోల్‌కతా ఇస్కాన్ VP రాధారమణ్ దాస్ ట్వీట్ చేశారు. 48 ఏళ్ల క్రితం న్యూయార్క్‌లో రథయాత్ర వేడుకల నిర్వహణకు అవసరమైన రథాలను తన భూమిలోనే నిర్మించుకునేందుకు ట్రంప్ అనుమతిచ్చారని గుర్తు చేశారు. ఆ తర్వాత యాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వడంతో సాఫీగా సాగిందన్నారు.

Similar News

News November 24, 2025

ముంబైలో “పాతాళ్ లోక్” నెట్‌వర్క్‌

image

ముంబైని ‘ట్రాఫిక్ ఫ్రీ’ నగరంగా తీర్చిదిద్దేందుకు MH ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ముంబైలో భారీ టన్నెల్‌ నెట్‌వర్క్‌ నిర్మిస్తామని CM దేవేంద్ర ఫడణవీస్ ప్రకటించారు. ఈ టన్నెల్‌ నెట్‌వర్క్‌ ఇప్పటికే ఉన్న రోడ్లతో ప్యారలల్‌గా ఉంటుందని తెలిపారు. ఈ సొరంగ మార్గాన్ని ఫేమస్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘పాతాళ్ లోక్’తో ఫడణవీస్ పోల్చారు. ఈ నెట్ వర్క్‌తో ముంబై ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని చెప్పారు.

News November 24, 2025

3 సిక్సులు కొట్టడమే గొప్ప!

image

పాకిస్థాన్‌కు చెందిన జీరో స్టూడియోస్‌ ఆ దేశ క్రికెటర్‌ సాహిబ్జాదా ఫర్హాన్‌పై “Hero in the Making” అనే డాక్యుమెంటరీ తీసింది. దానికి అసలు కారణం ఏంటంటే ఆసియా కప్‌ 2025లో అతను బుమ్రా బౌలింగ్‌లో 3 సిక్సులు కొట్టడమే. కాగా ఆసియా కప్‌లో భారత్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల్లోనూ పాక్‌ ఓడిపోవడం తెలిసిందే. దీంతో ‘3 సిక్సులు కొట్టడాన్నే వీళ్లు సక్సెస్‌గా ఫీల్ అవుతున్నారు’ అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

News November 24, 2025

భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో 156 పోస్టులు

image

HYDలోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (<>BDL<<>>) 156 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి డిసెంబర్ 8 వరకు అప్లై చేసుకోవచ్చు. www.apprenticeshipindia.gov.in పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దరఖాస్తు హార్డ్ కాపీని డిసెంబర్ 12లోపు పంపాలి. టెన్త్, ఐటీఐలో సాధించిన మార్కులు, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bdl-india.in/