News March 19, 2024
VIRAL: కింగ్ కోహ్లీ న్యూలుక్
మరో మూడ్రోజుల్లో ఐపీఎల్ 17వ సీజన్ మొదలు కానున్న నేపథ్యంలో ప్లేయర్లు అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆటతోనే కాకుండా తమ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్‌తో ఫ్యాన్స్‌ను ఆకట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. తాజాగా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ న్యూ లుక్‌ను ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ ఇన్‌స్టాలో షేర్ చేశారు. విరాట్ హాలీవుడ్ హీరోలా ఉన్నారంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News October 31, 2024
జుట్టు, చర్మం, గోళ్లను అందంగా మార్చే ‘బయోటిన్’
ఆరోగ్యానికి ఆహారమే ప్రధానం. అందులోంచే శరీరానికి అవసరమైన విటమిన్స్, మినరల్స్, మైక్రో న్యూట్రియంట్స్ అందుతాయి. పొల్యూషన్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ సహా అనేక కారణాలతో జుట్టు ఊడిపోతుంది. గోళ్లు పెళుసుగా మారతాయి. చర్మం నిగారింపు కోల్పోతుంది. బయోటిన్ ఈ మూడింటినీ పరిష్కరిస్తుందని స్టడీస్ పేర్కొంటున్నాయి. ప్రతిరోజూ విటమిన్ సీ, జింక్‌తో కలిపి దేహానికి బయోటిన్ అందేలా మీల్స్ ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నాయి.
News October 31, 2024
కర్రలతో కొట్టుకొనే స్థితి నుంచి స్వీట్లు తినిపించుకొనే స్థాయికి..
భారత్, చైనా దౌత్యనీతిలో టెక్టానిక్ షిఫ్ట్ వచ్చినట్టు కనిపిస్తోంది. ఇక కలవడం కష్టమే అనుకుంటే మిత్రబంధం ఒక్కసారిగా మెరుగైంది. కొవిడ్ టైమ్‌లో గల్వాన్‌లో చైనీయులను భారత జవాన్లు తరిమికొట్టారు. పిడిగుద్దులు, కర్రలు, రాడ్లతో చుక్కలు చూపించారు. ఇప్పుడు డిస్‌ఎంగేజ్‌మెంట్ ఒప్పందం కుదరడంతో స్వీట్లు తినిపించి జైశ్రీరామ్ అనిపించారు. భారత్ ఇదే ధోరణిలో సరిహద్దు సమస్యను పూర్తిగా పరిష్కరించుకోనుందా? మీ కామెంట్.
News October 31, 2024
టెస్టుల్లో డిఫెన్స్ కోల్పోతున్నారు: గంభీర్
T20లు ఎక్కువ ఆడడం వల్ల టెస్ట్ క్రికెట్‌లో ఆటగాళ్లు డిఫెన్స్ కోల్పోతున్నట్టు గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డారు. కివీస్‌తో 3వ టెస్ట్‌కు ముందు ఆయన మాట్లాడుతూ విజయవంతమైన ఆటగాళ్లందరూ టెస్టుల్లో మంచి డిఫెన్స్ టెక్నిక్ కలిగి ఉన్నారని చెప్పారు. టెస్టు క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసిన విరాట్ లాంటి ప్లేయర్లకు డిఫెన్స్ వారిసొంతమన్నారు. అదే టెస్ట్ క్రికెట్‌కు పునాదిలాంటిదని పేర్కొన్నారు.