News August 16, 2024

VIRAL: LKG ఫీజు రూ.3.70 లక్షలు!

image

హైదరాబాద్‌లో LKG పిల్లల స్కూల్ ఫీజులపై బెంగళూరుకు చెందిన ఇన్వెస్టర్ అవిరాల్ భట్నాగర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. LKG ఫీజు సంవత్సరానికి రూ.3.70 లక్షలుగా ఉందని, ఏడాది క్రితం రూ.2.30 లక్షలుగా ఉండేదని తెలిపారు. అయితే ఆయన స్కూల్ పేరును మెన్షన్ చేయలేదు. దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉందన్నారు. సగటు మధ్యతరగతి కుటుంబం ఆహారం, విద్య, ఆరోగ్యంపైనే 70% ఖర్చు చేస్తోందని మరో వ్యక్తి కామెంట్ చేశారు.

Similar News

News January 21, 2025

సోలార్ సెల్ ప్లాంట్‌ను ఏపీలో పెట్టండి: లక్ష్మీ మిట్టల్‌తో మంత్రి లోకేశ్

image

AP: దావోస్‌లోని బెల్వేడార్‌లో మిట్టల్ గ్రూప్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్‌తో CM చంద్రబాబు, మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. భావనపాడును పెట్రోకెమికల్ హబ్‌గా మార్చడానికి పెట్టుబడులు పెట్టాలని మంత్రి కోరారు. పెట్రో కెమికల్స్, గ్రీన్ ఎనర్జీలో నూతన ఆవిష్కరణలకు అవకాశాలు ఉన్నాయని వివరించారు. రూ.3,500 కోట్లతో భారత్‌లో ఏర్పాటు చేయాలనుకుంటున్న 2GW సామర్థ్యం గల సోలార్ సెల్ తయారీ ప్లాంట్‌ను ఏపీలో నెలకొల్పాలని కోరారు.

News January 21, 2025

ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం

image

తెలంగాణలో ఇంటర్ కాలేజీల్లో <<15028933>>మధ్యాహ్న భోజన పథకం<<>> అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. CM రేవంత్ సూచనలతో ఇంటర్ బోర్డు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం అంగీకారం తెలిపితే 2025-26 విద్యా సంవత్సరం నుంచి మధ్యాహ్న భోజనం విద్యార్థులకు అందించనుంది. రాబోయే బడ్జెట్‌లో ప్రభుత్వం నిధులు కేటాయించే అవకాశం ఉంది. రాష్ట్రంలో 425 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉండగా, సుమారుగా 1.75 లక్షల మంది చదువుతున్నారు.

News January 21, 2025

క్రైమ్‌సీన్ రీక్రియేషన్.. సైఫ్ ఇంటికి నిందితుడిని తీసుకొచ్చిన పోలీసులు

image

యాక్టర్ సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. క్రైమ్‌సీన్ రీక్రియేషన్ కోసం నిందితుడు మహ్మద్ షరీఫుల్‌ను అతడి ఇంటి వద్దకు తీసుకొచ్చారు. క్రైమ్ సీక్వెన్స్‌లో భాగంగా అంతకు ముందే నేషనల్ కాలేజ్ బస్టాప్, బాంద్రా రైల్వే స్టేషన్ సహా మరికొన్ని ప్రాంతాలకు తీసుకెళ్లారు. ఆదివారం పోలీసులు అతడిని థానేలో అరెస్టు చేశారు. సైఫ్‌ను అతడు ఆరుసార్లు కత్తితో పొడవడం తెలిసిందే.