News April 13, 2025
VIRAL: మా అమ్మకు నానమ్మ, తాతయ్య నచ్చరు: విద్యార్థిని

TG: రాజన్న సిరిసిల్ల(D) చందుర్తిలో ఓ నాలుగో తరగతి విద్యార్థిని పరీక్షలో ఆసక్తికర సమాధానం రాసింది. ఇంగ్లిష్ ప్రశ్నాపత్రంలో ‘మీ అమ్మకు నచ్చిన, నచ్చనివి ఏవి’ అని అడిగారు. అమ్మకు నానమ్మ, తాతయ్య నచ్చరని విద్యార్థిని సమాధానం రాసింది. ఇందుకు సంబంధించిన ఫొటో SMలో వైరల్ అవుతుండగా, నేటి కాలంలో కోడళ్లకు అత్తమామల పట్ల ఎలాంటి భావన ఉందో దీని ద్వారా తెలుస్తోందని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News April 13, 2025
అటు ప్రీతి జింటా, ఇటు కావ్యా మారన్(VIRAL)

SRH-PBKS మ్యాచ్ సందర్భంగా ఆయా జట్ల ఓనర్లు కావ్యా మారన్, ప్రీతి జింటా ఉప్పల్లో సందడి చేశారు. తమ ప్లేయర్లు సిక్సర్లు, ఫోర్లు కొట్టినప్పుడు, వికెట్లు పడినప్పుడు వారు ఇచ్చిన హావభావాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అభిషేక్ శర్మ సెంచరీ చేయగానే కావ్యా అతని పేరెంట్స్ దగ్గరికెళ్లి అభినందనలు తెలిపారు. మ్యాచ్ తర్వాత అభిషేక్ ట్రేడ్ మార్క్ సెలబ్రేషన్ను గుర్తుచేస్తూ ప్రీతి కంగ్రాట్స్ చెప్పడం విశేషం.
News April 13, 2025
జావెలిన్ త్రోయర్పై నాలుగేళ్ల నిషేధం

భారత జావెలిన్ త్రోయర్ డీపీ మనుపై NADA నాలుగేళ్ల నిషేధం విధించింది. గతేడాది ఏప్రిల్లో జరిగిన గ్రాండ్ ప్రిక్స్-1 సందర్భంగా అతడి నుంచి శాంపిల్స్ సేకరించగా నిషేధిత పదార్థం వాడినట్లు తేలింది. ఆ పోటీల్లో మను విజేతగా నిలవడం గమనార్హం. అయితే డోపింగ్ టెస్టులో విఫలం కావడంతో అతడిపై నాడా తాత్కాలిక నిషేధం విధించింది. మనుపై 2028 వరకు నిషేధం కొనసాగించనున్నట్లు తాజాగా ప్రకటించింది.
News April 13, 2025
తహవూర్ రాణా అడిగిన వస్తువులు ఇవే..

అమెరికా నుంచి భారత్కు తీసుకొచ్చిన ముంబై పేలుళ్ల సూత్రదారి తహవూర్ రాణా విచారణ కొనసాగుతోంది. ఈ కరుడుగట్టిన ఉగ్రవాదిని ఢిల్లీలోని NIA ఆఫీస్లో ఉంచి విచారిస్తున్నారు. ఈ సందర్భంగా అతడు పెన్ను, పేపర్లతో పాటు ఖురాన్ ఇవ్వాలని అధికారులను కోరారట. దీంతో వాటిని అందజేశారు. ఇతర ఖైదీల మాదిరిగానే రాణాని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం భారత్కు వచ్చిన రాణాకు ఢిల్లీ కోర్టు 18 రోజుల కస్టడీ విధించింది.