News November 12, 2024
VIRAL: ఏపుగా కాదు.. అడ్డంగా పెరుగుతాయ్!

పైనున్న చెట్టుకేంటి ఒకవైపే కొమ్మలున్నాయి అనుకుంటున్నారా? ఇలాంటివి న్యూజిలాండ్‌లో కనిపిస్తుంటాయి. ప్రత్యేకించి స్లోప్ పాయింట్ సమీపంలోని సౌత్ ఐలాండ్‌లో ఉంటాయి. దక్షిణ మహాసముద్రం నుంచి వచ్చే ఎడతెగని గాలుల వల్ల ఇలాంటి ఆకృతిలో చెట్లు పెరుగుతుంటాయి. ఈ గాలులు బలంగా, స్థిరంగా ఉండటంతో చెట్లు అడ్డంగా పెరిగినట్లు కనిపిస్తుంటుంది. కఠోరమైన పరిస్థితులనూ ప్రకృతి తనకు అనుకూలంగా మార్చుకుంటుందనడానికి ఇదొక ఉదాహరణ.
Similar News
News January 14, 2026
రూ.15,000 పెరిగిన వెండి ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వెండి ధరలు భారీగా పెరిగాయి. కేజీపై ఏకంగా రూ.15,000 పెరిగి రూ.3,07,000కు చేరింది. బంగారం ధరలు సైతం గణనీయంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,090 ఎగబాకి రూ.1,43,620కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 1,000 పెరిగి రూ.1,31,650గా ఉంది. 3 రోజుల్లో కేజీ వెండి ధర రూ.32,000 పెరగడం గమనార్హం.
News January 14, 2026
దారుణం.. విష ప్రయోగంతో 600 కుక్కలు మృతి

TG: కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. వీధికుక్కలపై విషప్రయోగం జరగడంతో దాదాపు 500-600 శునకాలు మృతిచెందాయి. మాచారెడ్డి(M) ఫరీద్‌పేట్, భవానీపేట, వాడి, పల్వంచలో నూతనంగా ఎంపికైన సర్పంచ్‌లు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటనపై ‘గౌతమ్ స్ట్రే యానిమల్స్ ఫౌండేషన్’ ప్రతినిధులు చేసిన ఫిర్యాదుతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.
News January 14, 2026
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 పోస్టులు

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 అప్రెంటిస్ పోస్టులకు షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ అర్హతగల వారి నుంచి జనవరి 15 నుంచి 25 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. మెరిట్ లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: bankofmaharashtra.bank.in


