News July 15, 2024

VIRAL: చైనాలో ట్రంప్ టీషర్టుల విక్రయం

image

డొనాల్డ్ ట్రంప్‌పై నిన్న కాల్పులు జరిగిన కాసేపటికే చైనాలో ఆన్‌లైన్ రిటైలర్లు ఆయన ఫొటోతో టీషర్ట్‌లు ప్రింట్ చేసి విక్రయించారు. కాల్పుల అనంతరం ట్రంప్ పిడికిలి చూపించిన ఫొటోతో పాటు దాడిలో గాయపడిన చిత్రాలను వాటిపై ముద్రించి అమ్మకానికి పెట్టారు. ఈ టీషర్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Similar News

News February 3, 2026

మగవారిని బుట్టలో వేసుకోవడం ఎలా? క్లాసులు చెప్పి ₹కోట్లు గడించిన మహిళ!

image

చైనాకు చెందిన 47 ఏళ్ల జౌ యువాన్ అనే మహిళ Flirting పాఠాలు చెబుతూ ఏకంగా ₹31.5 కోట్ల ఆదాయం గడించారు. ‘గాడ్ మదర్ ఆఫ్ సెక్సువల్ ఇంటెలిజెన్స్’గా పేరొందిన ఆమె.. చూపులు, ఎక్స్‌ప్రెషన్స్, వాయిస్ మాడ్యులేషన్‌తో భర్తలను లేదా పార్ట్‌నర్లను ఎలా అట్రాక్ట్ చేయాలో చెబుతారు. ముఖ్యంగా ‘X-షేప్’ ఐ కాంటాక్ట్ వంటి ఆమె ట్రిక్స్ వైరలయ్యాయి. వేలాది మంది మహిళలు ₹లక్షలు ఖర్చు చేసి మరీ ఆమె వర్క్‌షాప్స్‌లో పాల్గొంటున్నారు.

News February 3, 2026

SBIలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

image

<>SBI<<>>లో 12 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి BE/BTech/B.Des, MCA/MTech/MSc అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు. వైస్ ప్రెసిడెంట్‌కు ఏడాదికి రూ.80లక్షలు, డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్‌కు రూ.60లక్షలు, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్‌కు రూ.45లక్షలు, Sr. స్పెషల్ ఎగ్జిక్యూటివ్‌కు రూ.40లక్షలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: sbi.bank.in

News February 3, 2026

కడియం శ్రీహరికి స్పీకర్ నోటీసులు

image

TG: అనర్హత పిటిషన్‌పై విచారణకు హాజరు కావాలని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీచేశారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు. అలాగే కడియంపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ అందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానందకు కూడా నోటీసులు పంపారు. విచారణకు హాజరుకావాలని సూచించారు.