News September 30, 2024
VIRAL: 1985 నాటి రెస్టారెంట్ బిల్

ఫ్యామిలీ అంతా కలిసి రెస్టారెంట్ డిన్నర్కి వెళ్తే రూ.వేలల్లో ఖర్చవడం పక్కా. కానీ, రూ.26తో ముగ్గురు పుష్టిగా తినొచ్చు. ఏంటీ షాక్ అయ్యారా? 40 ఏళ్ల క్రితం ఇది సాధ్యమే మరి. 1985 నాటి రెస్టారెంట్ బిల్లు ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. షాహీ పనీర్ రూ.8, దాల్ మఖానీ రూ.5కే సర్వ్ చేశారు. పాత రోజులే బెటర్ అని, సరసమైన ధరలకే మంచి ఆహారం లభించేదని నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు.
Similar News
News October 23, 2025
కొనసాగుతున్న క్యాబినెట్ భేటీ

TG: సీఎం రేవంత్ అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో క్యాబినెట్ భేటీ కొనసాగుతోంది. బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు, సుప్రీంకోర్టులో ప్రతికూల పరిస్థితులు ఎదురైన నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై కీలకంగా చర్చిస్తున్నారని సమాచారం. ఇటీవల వివాదాలతో వార్తల్లో నిలిచిన కొండా సురేఖ సైతం క్యాబినెట్ భేటీకి హాజరయ్యారు.
News October 23, 2025
మహిళలూ బండిపై ప్రయాణిస్తున్నారా..ఈ జాగ్రత్తలు తీసుకోండి

ఈ బిజీ ప్రపంచంలో మహిళలు కూడా నిత్యం వాహనాలు నడపడం తప్పనిసరైంది. అయితే ఈ సమయంలో ప్రమాదాలు నివారించడానికి కొన్నిజాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. బండి నడిపేటపుడు చీర కొంగు, చున్నీ ఎగరకుండా బిగించి కట్టుకోవాలి. లేదంటే చక్రాలకు శారీగార్డు ఏర్పాటు చేసుకోవాలి. హెల్మెట్ వాడటం తప్పనిసరి. పిల్లలతో ప్రయాణించేటపుడు టూ వీలర్ బేబీ బెల్ట్, ఛైల్డ్ క్యారియర్ వాడటం వల్ల ప్రమాదాల తీవ్రత తగ్గుతుంది.
News October 23, 2025
సన్నధాన్యం: ఈ ప్రమాణాలు ఉంటేనే రూ.500 బోనస్

TG: సన్నధాన్యానికి ప్రభుత్వం క్వింటాకు ₹500 బోనస్ ఇస్తోంది. అయితే బియ్యపు గింజ పొడవు, వెడల్పుల నిష్పత్తి నిర్దేశిత ప్రమాణాల మేర ఉంటేనే బోనస్ వస్తుంది. గ్రెయిన్ కాలిపర్ అనే మిషన్ ద్వారా గింజ పొడవు, వెడల్పు కొలుస్తారు. గింజ పొడవు 6mm, వెడల్పు 2mm కంటే తక్కువ ఉండాలి. పొడవు, వెడల్పుల నిష్పత్తి 2.5mm కంటే ఎక్కువ ఉండేవాటికి ప్రాధాన్యం ఇస్తారు. * రోజూ అగ్రికల్చర్ కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.