News April 19, 2024
Viral: అప్పుడు రీనా.. ఇప్పుడు ఇషా

రీనా ద్వివేది.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో సోషల్ మీడియా స్టార్ అయ్యారు. ఎన్నికల విధులకు పసుపు రంగు చీరలో వచ్చిన ఆమె ఒక్కసారిగా స్టార్ డమ్ తెచ్చుకున్నారు. తాజాగా.. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఇషా అరోరా అనే అధికారిణి నెట్టింట ట్రెండింగ్‌గా మారారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో పోలింగ్ ఏజెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఆమె తన ట్రెండీ లుక్‌తో నెటిజన్లను ఆకర్షించారు. దీంతో ఆమె ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి.
Similar News
News October 10, 2025
నటుడు, బాడీబిల్డర్ వరీందర్ సింగ్ కన్నుమూత

నటుడు, బాడీబిల్డర్ వరీందర్ సింగ్ గుమాన్(42) గుండెపోటుతో మరణించారు. పంజాబ్‌కు చెందిన ఆయన 2009లో మిస్టర్ ఇండియా కాంపిటీషన్ గెలిచారు. మిస్టర్ ఏషియా పోటీల్లో రెండో స్థానం సాధించారు. 2012లో ‘కబడ్డీ వన్స్ అగైన్’ అనే పంజాబీ మూవీలో హీరోగా, ఆ తర్వాత బాలీవుడ్లో ‘రోర్: టైగర్స్ ఆఫ్ సుందర్బన్స్’, ‘మర్జావాన్’, సల్మాన్ ‘టైగర్-3’ మూవీలో నటించారు. నిన్న ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా గుండెపోటుతో మృతిచెందారు.
News October 10, 2025
WPL ఆక్షన్ తేదీలు ఖరారు?

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2026 మెగా వేలం నవంబర్ 25-29 తేదీల మధ్య జరిగే అవకాశం ఉందని క్రీడా వర్గాలు తెలిపాయి. ఒక్కో టీమ్ రూ.15కోట్ల పర్స్ కలిగి ఉంటాయని, 2025 స్క్వాడ్ నుంచి ఐదుగురిని రిటైన్ చేసుకోవచ్చని పేర్కొన్నాయి. నవంబర్ 5లోగా జట్ల యాజమాన్యాలు రిటెన్షన్స్ను ప్రకటించాల్సి ఉంటుంది. 2023 నుంచి ఈ టోర్నీని నిర్వహిస్తుండగా ముంబై ఇండియన్స్ (2023, 25) రెండుసార్లు, RCB ఒకసారి (2024) విజేతగా నిలిచాయి.
News October 10, 2025
లేఆఫ్స్‌పై ఆ ప్రచారంలో నిజం లేదు: TCS

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS)లో 50,000-80,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నారన్న ప్రచారాన్ని సంస్థ CHRO సుదీప్ కన్నుమల్ ఖండించారు. అందులో నిజం లేదని తెలిపారు. మిడ్& సీనియర్ లెవెల్ ఉద్యోగుల్లో 1% (6,000) మందిని మాత్రమే తొలగించినట్లు స్పష్టం చేశారు. కాగా FY26 Q1లో ఆ సంస్థ ఉద్యోగుల సంఖ్య 6,13,069గా ఉండగా, FY26 Q2లో 5,93,314కి తగ్గినట్లు IT వర్కర్స్ యూనియన్ NITES స్టేట్మెంట్ విడుదల చేసింది.