News October 7, 2024

VIRAL: హైదరాబాద్ గొప్పతనం ఇదే!

image

పొట్టకూటి కోసం తరలివచ్చిన ఎంతో మందికి హైదరాబాద్ అండగా నిలిచిందని తెలిపే ఓ ఫొటో వైరలవుతోంది. ‘బతకడమే వేస్ట్ అనుకున్న నాకు.. హైదరాబాద్ ఎలా బతకాలో నేర్పింది’ అని ఓ వ్యక్తి తన ఆటో వెనుక రాసుకున్నారు. దీనిని ఓ వ్యక్తి ఫొటో తీసి నెట్టింట పోస్ట్ చేశారు. ఉపాధి కోసం వస్తే అమ్మలా కడుపులో పెట్టుకుని చూసుకుంటుందని నెటిజన్లు కితాబిస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు HYDలో ఉపాధి పొందుతున్నారు.

Similar News

News October 25, 2025

కోహ్లీ&రోహిత్ ‘క్యాచుల’ రికార్డు

image

భారత స్టార్ ప్లేయర్ కోహ్లీ AUSతో జరుగుతున్న మూడో వన్డేలో అరుదైన రికార్డు సృష్టించారు. AUSలో AUSపై అత్యధిక క్యాచ్‌లు(38*) పట్టిన ప్లేయర్‌గా నిలిచారు. ఇవాళ 2 క్యాచ్‌లు పట్టి ఇయాన్ బోథమ్(36) పేరిట ఉన్న రికార్డును అధిగమించారు. అటు రోహిత్ శర్మ 100 క్యాచెస్ క్లబ్‌లో చేరారు. ఈ లిస్ట్‌లో కోహ్లీ(163*), అజారుద్దీన్(156), సచిన్(140), ద్రవిడ్(124), రైనా(102) తర్వాత ఆరో ప్లేయర్‌గా చోటు దక్కించుకున్నారు.

News October 25, 2025

ఇతర పదవుల్లో ఉండే వారికి DCC రాదు: PCC చీఫ్

image

TG: సమర్థులను DCC అధ్యక్షులుగా ఎంపిక చేస్తామని PCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ‘జిల్లాల నుంచి భారీగా అప్లికేషన్లు వచ్చాయి. కనీసం 5ఏళ్లు పార్టీలో పనిచేసి ఉండాలన్న నిబంధన ఉంది. మ.3కు అధిష్ఠానం CM, Dy.CMతో పాటు నా అభిప్రాయం తీసుకొని లిస్టు ఫైనల్ చేస్తుంది. సామాజిక న్యాయం ప్రకారం ఎంపిక ఉంటుంది. ఇప్పటికే పదవుల్లో ఉన్నవారికి DCC ఇవ్వరాదనే నియమం ఉంది. అలాంటి వారికి ఈ పదవి రాదు’ అని స్పష్టం చేశారు.

News October 25, 2025

ఫ్లవర్‌వాజ్‌లో పూలు తాజాగా ఉండాలంటే..

image

ఫ్లవర్ వాజ్‌లో ప్లాస్టిక్ పువ్వులకు బదులు రియల్ పువ్వులను పెడితే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. కానీ ఇవి త్వరగా వాడిపోతుంటాయి. ఇలా కాకుండా ఉండాలంటే పువ్వులను ఫ్లవర్‌వాజ్‌లో పెట్టేటప్పుడు వాటి కాడలను కొంచెం కట్ చేయాలి. అలాగే ఈ నీటిని రెండు రోజులకు ఒకసారి మారుస్తుండాలి. ఇందులో కాపర్ కాయిన్/పంచదార/ వెనిగర్ వేస్తే పువ్వులు ఫ్రెష్‌గా ఉంటాయి. ఫ్లవర్‌వాజ్‌ను నేరుగా ఎండ తగిలే ప్లేస్‌లో ఉంచకూడదు.