News October 29, 2024
VIRAL: విల్లా కొంటే లంబోర్గిని ఫ్రీ

యూపీకి చెందిన ఓ రియల్ వ్యాపారి తన వద్ద విల్లా కొంటే లంబోర్గిని కార్ ఫ్రీ అని సోషల్ మీడియాలో ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్‌గా మారింది. నోయిడాకు చెందిన జేపీ గ్రీన్స్ తమ వెంచర్‌లోని రూ.26 కోట్ల విలువైన విల్లాను కొనుగోలు చేస్తే రూ.4 కోట్ల విలువైన లంబోర్గిని ఉరుస్ కారు ఇస్తానని తెలిపారు. స్విమ్మింగ్ పూల్, థియేటర్, గోల్ఫ్ కోర్స్ కోసం అదనంగా రూ.50 లక్షలు చెల్లించాలని పేర్కొన్నారు.
Similar News
News February 9, 2026
394 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (<
News February 9, 2026
గొర్రె, మేక పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

గొర్రె, మేక పిల్లలు పుట్టాక వారం వరకు రైతులు జాగ్రత్తగా చూసుకోవాలి. తల్లి నుంచి సరిపడా పాలు అందుతున్నాయా? లేదా? గమనించాలి. ఇది వాటి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వెటర్నరీ డాక్టరు సూచన మేరకు దాణా అందించాలి. రెండు నుంచి ఐదు నెలల వరకు జొన్నలను దాణాగా ఇవ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన మొక్కజొన్నలను పెట్టాలి. విటమిన్స్, కాల్షియం దాణాలో తగినంత ఉండేలా చూడాలి. పిల్లలకు 3 నెలల వయసులో డీవార్మింగ్ ప్రారంభించాలి.
News February 9, 2026
దీపాన్ని ఎలా వెలిగించాలంటే?

దీపారాధన చేసేటప్పుడు ముందుగా కుందుల్లో నూనె పోయాలి. ఆ తర్వాతే వత్తులు వేయాలి. వెండి, ఇత్తడి, మట్టి కుందులు వాడటం శ్రేష్ఠం. స్టీలు కుందులు అస్సలు వాడకూడదు. దీపపు కుందును నేరుగా నేలపై పెట్టడం మంచిది కాదు. పళ్లెం లేదా తమలపాకుపై ఉంచాలి. అగ్గిపుల్లతో నేరుగా దీపాన్ని వెలిగించకూడదు. ఏకహారతి లేదా అగరవత్తి సాయంతో వెలిగించాలి. దీపానికి మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షింతలు వేయడం వల్ల సంపూర్ణ ఫలితం లభిస్తుంది.


