News April 7, 2025
VIRAL: జీనియస్ డైరెక్టర్‌తో యంగ్ టైగర్

యంగ్ టైగర్ NTR, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ ఇద్దరూ తాజాగా మీట్ అయ్యారు. ఈ సందర్భంగా వారు హగ్ చేసుకున్న ఫొటోను సుకుమార్ భార్య తబిత ఇన్‌స్టాలో పంచుకున్నారు. ‘తారక్‌కి ప్రేమతో’ అన్న క్యాప్షన్ ఇచ్చారు. రీపోస్ట్ చేసిన NTR, ‘నన్ను ఎప్పుడూ వెంటాడే ఎమోషన్ సుకుమార్’ అని రాసుకొచ్చారు. దీంతో వీరి కాంబోలో మరో మూవీ రాబోతుందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ‘నాన్నకు ప్రేమతో’ మూవీకి వీరు కలిసి పనిచేశారు.
Similar News
News April 9, 2025
ట్రంప్ నిర్ణయం దెబ్బకొడుతుందా?

అధిక టారిఫ్స్ విధిస్తూ ప్రపంచ దేశాలు తమను దోచుకుంటున్నాయని US ప్రెసిడెంట్ ట్రంప్ చెబుతున్నారు. అందుకే తామూ సుంకాలు పెంచామని స్పష్టం చేశారు. దీనివల్ల అమెరికాలో పరిశ్రమలు, ఉద్యోగాలు పెరుగుతాయని ట్రంప్ నమ్మకం. అయితే USలో బ్లూ కాలర్ జాబ్స్ చేసేందుకు యువత సిద్ధంగా లేరు. అక్కడి కంపెనీలు చీప్ లేబర్ కోసం చూస్తాయి. విదేశీయులు లేకుండా అగ్రరాజ్యం మనుగడ కష్టం. మరి ట్రంప్ నిర్ణయం ఎటు దారితీస్తుందో చూడాలి.
News April 9, 2025
రోనాల్డ్ రాస్కు భారీ ఊరట

TG: సీనియర్ ఐఏఎస్ అధికారి రోనాల్డ్ రాస్కు క్యాట్ భారీ ఊరట కలిగించింది. ఆయన తెలంగాణలోనే కొనసాగేలా ఉత్తర్వులు జారీ చేసింది. కాగా కొద్ది రోజుల క్రితం తెలంగాణకు చెందిన ఐదుగురు ఐఏఎస్ అధికారులను ఏపీకి కేటాయిస్తూ డీఓపీటీ ఆదేశాలు జారీ చేసింది. వీరిలో రోనాల్డ్ రాస్ కూడా ఉన్నారు. ఆయన మళ్లీ క్యాట్‌ను ఆశ్రయించడంతో ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శిగా కొనసాగుతున్నారు.
News April 9, 2025
వక్ఫ్ చట్టం అమలు చేసేది లేదు: మమతా బెనర్జీ

వక్ఫ్ చట్టాన్ని బెంగాల్లో అమలు చేసేది లేదని సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని వక్ఫ్ ఆస్తులకు ఎటువంటి ప్రమాదం ఉండదని ముస్లిం ప్రజలకు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మతం పేరిట విభజన రాజకీయాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అందరూ బాగుండాలనే ఉద్దేశంతోనే తాను అన్ని మతాల కార్యక్రమాలకు హాజరవుతానన్నారు. తనను కాల్చి చంపినా సమైక్యత నుంచి వేరు చేయలేరని తేల్చిచెప్పారు.