News March 5, 2025
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ

తనకు ఉన్న ‘ఛేజ్ మాస్టర్’ పేరును విరాట్ కోహ్లీ నిలబెట్టుకుంటున్నారు. నిన్న ఆసీస్‌పై 84 రన్స్ చేయడం ద్వారా వన్డేల్లో లక్ష్య ఛేదనలో అత్యంత వేగంగా 8,000 పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. కింగ్ కేవలం 159 ఇన్నింగ్సుల్లోనే 8,063 రన్స్ చేశారు. ఇందులో 28 సెంచరీలుండటం విశేషం. సచిన్ 232 ఇన్నింగ్సుల్లో 8,720 రన్స్‌తో టాప్‌లో ఉండగా, రోహిత్(6,115 పరుగులు) మూడో స్థానంలో ఉన్నారు.
Similar News
News September 19, 2025
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాల వివరాలు (2/2)

Day 4(sep 27): కల్పవృక్ష వాహనం,సర్వ భూపాల వాహనం
Day 5(sep 28) : మోహినీ అవతారం, గరుడ వాహనం
Day 6(sep 29) : హనుమంత వాహనం, స్వర్ణ రథోత్సవం, గజ వాహనం
Day 7(sep 30) : సూర్య ప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం
Day 8(Oct 1) : రథోత్సవం, అశ్వ వాహనం
Day 9(sep 2) : పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం, చక్రస్నానం, ధ్వజావరోహణం
News September 19, 2025
సొరకాయలు కోతకు వచ్చినట్లు ఎలా గుర్తించాలి?

సొరకాయల పంట నాటిన 55-75 రోజులకు కోతకు వస్తుంది. లేత కాయలను గోటితో నొక్కినప్పుడు తొక్క లోపలికి గోరు సులభంగా పోతుంది. అలాగే లేత కాయల తొక్క మీద నూగు ఉంటుంది. కాయ లోపల గింజలు, గుజ్జు గట్టిపడక ముందే కాయలను కోసి మార్కెట్‌కు తరలించాలి. ముదిరిన కాయల తొక్క గట్టిపడి క్రమంగా తెలుపు రంగులోకి మారుతుంది. కాయలను కోసేటప్పుడు తొడిమలతో సహా కోసి మార్కెట్‌కు తరలించాలి. కోసిన కాయలు 2 నుంచి 3 రోజుల వరకు నిల్వ ఉంటాయి.
News September 19, 2025
వరి చిరు పొట్ట దశలో పొటాష్ వేస్తున్నారా?

వరిసాగులో ఎరువుల యాజమాన్యం ముఖ్యం. సరైన సమయంలో పంటకు అవసరమైన ఎరువులు, పోషకాలు అందించాలి. తెలుగు రాష్ట్రాలలో తేలిక భూములే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వరి చిరు పొట్ట దశలో ఎకరాకు 35 నుంచి 40 కిలోల యూరియాతో పాటు 20 నుంచి 25 కిలోల పొటాష్ ఎరువును వాడటం మంచిది. ఈ దశలో పొటాష్ వాడకం వల్ల వెన్నులో గింజ నాణ్యంగా ఉండి.. తాలు గింజలు ఏర్పడవు. దీని వల్ల అధిక దిగుబడులకు అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.