News January 17, 2025

విరాట్ కోహ్లీకి గాయం!.. రంజీల్లో ఆడతాడా?

image

విరాట్ కోహ్లీ మెడ కండరాల గాయంతో బాధపడుతున్నట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. దీనికి ఇంజెక్షన్ కూడా తీసుకున్నారని, రంజీ ట్రోఫీలో ఆయన ఆడటంపై సందిగ్ధత నెలకొందని పేర్కొన్నాయి. ఆయన ఢిల్లీ టీమ్‌తో ట్రావెల్ అవుతారని, పూర్తిగా కోలుకుంటేనే ఆడతారని తెలుస్తోంది. గాయం నుంచి కోలుకోకుంటే ప్రాక్టీస్‌కు మాత్రమే పరిమితం కానున్నారు. త్వరలో ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఉండటంతో ఈ వార్త ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది.

Similar News

News December 4, 2025

రూపాయి మరింత పతనం

image

రూపాయి నేలచూపులు ఆగడం లేదు. ఇవాళ మరోసారి రికార్డు కనిష్ఠ స్థాయిని తాకింది. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 90.43కి పడిపోయింది. నిన్న 90.19 వద్ద ముగిసింది. భారత ఈక్విటీ, డెట్ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటుండటంతో డాలర్ విలువ పెరిగి రూపాయి కిందికి పడుతోంది. ఏడాదిలో 85 నుంచి 90కి పడిపోయిందని, ఇది అత్యంత వేగవంతమైన క్షీణత అని ఎస్‌బీఐ తెలిపింది.

News December 4, 2025

సంక్రాంతి నుంచి ప్రభుత్వ హాస్టళ్లల్లో చేపల కూర!

image

TG: ప్రభుత్వ హాస్టళ్లు, క్రీడా పాఠశాలల్లోని విద్యార్థులకు చేపల కూర వడ్డించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సంక్రాంతి తర్వాత ఈ పథకం అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది. మత్స్యశాఖ ఇప్పటికే సుమారు 50 కోట్ల చేపపిల్లలను చెరువుల్లో వదిలింది. చేపల ఉత్పత్తి పెరిగితే విద్యార్థులకు పంపిణీ చేసేందుకు ఇప్పటికే సర్కారు ప్రణాళికలను సిద్ధం చేసింది.

News December 4, 2025

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.220 తగ్గి రూ.1,30,360కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.200 పతనమై రూ.1,19,500 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.1,000 తగ్గి రూ.2,00,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.