News March 7, 2025

విరాట్ కోహ్లీ గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు!

image

రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఛాంపియన్స్ ట్రోఫీలో అదరగొడుతున్నారు. ఓ సెంచరీతో పాటు క్లిష్ట సమయాల్లో ఇండియా గెలుపుకోసం శ్రమిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో కోహ్లీ పేరు మార్మోగుతోంది. ఈ ఏడాది వికీపీడియాలో అత్యధిక సార్లు సెర్చ్ చేసిన ప్లేయర్‌గా విరాట్ నిలిచారు. 6.61లక్షల సార్లు కోహ్లీ గురించి సెర్చ్ చేశారు. ఆ తర్వాత రచిన్ రవీంద్ర గురించి 2.42 లక్షల మంది, శుభ్‌మన్ గిల్ గురించి 2.38 లక్షల మంది శోధించారు.

Similar News

News March 4, 2026

రేపు టెన్త్ హాల్ టికెట్లు విడుదల

image

ఏపీలో పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు రేపు విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటల నుంచి <>వెబ్‌సైట్‌లో<<>> విద్యార్థులు తమ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మనమిత్ర వాట్సాప్, లీప్ యాప్‌లోనూ ఈ అవకాశం ఉంటుంది. నామినల్ రోల్స్‌లో విద్యార్థుల పేరు, పుట్టిన తేదీ వంటి వివరాల్లో దొర్లిన తప్పులను సరిదిద్దుకోవడానికి FEB 26-28 మధ్య అవకాశం ఇచ్చారు. కాగా ఈ నెల 16 నుంచి రాష్ట్రంలో టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి.

News March 4, 2026

ఏపీలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు?

image

జూన్ తర్వాతే పంచాయతీ ఎన్నికలు జరిగేలా కనిపిస్తోంది. ప్రస్తుత పాలకవర్గాల గడువు ఏప్రిల్ 2తో ముగియనుండగా ప్రత్యేక పాలన విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఏకసభ్య కమిషన్ నివేదిక, BC రిజర్వేషన్ల ప్రక్రియ ప్రారంభానికి 3నెలలు పట్టే అవకాశం ఉంది. కమిషన్ నివేదిక ఆలస్యమైనా, రిజర్వేషన్ల అంశం కోర్టుకెక్కినా పంచాయతీ ఎన్నికలు మరింత ఆలస్యం కావచ్చు. అటు పరిషత్ ఎన్నికల తర్వాతే ‘పంచాయతీ’ నిర్వహించాలనే వాదనా ఉంది.

News March 4, 2026

ఇవాళ స్కూళ్లకు సెలవేనా?

image

చంద్రగ్రహణంతో ఈసారి హోలీ పండుగ ఎప్పుడనే గందరగోళం ఏర్పడింది. కొందరు నిన్నే రంగులు చల్లుకోగా.. AP, TG ప్రభుత్వాలూ స్కూళ్లకు మంగళవారమే సెలవు ఇచ్చాయి. అయితే గ్రహణం ఉండటంతో ఇవాళ(బుధవారం) హోలీ జరుపుకోవాలని పండితులు తెలిపారు. కానీ స్కూళ్లకు నిన్నే పబ్లిక్ హాలిడే ఇవ్వడంతో ఇవాళ సెలవు లేదు. పిల్లలు బడికి వెళ్లాల్సిందే. అటు చాలావరకు ప్రైవేటు కార్యాలయాలకు ఇవాళ సెలవు ఉన్నట్లు తెలుస్తోంది. మరి మీకూ ఉందా?